Advertisementt

మహేష్ కి బాహుబలే కావాలా..?

Fri 27th Jul 2018 11:40 PM
  మహేష్ కి బాహుబలే కావాలా..?
Sneak Peek Of Mahesh Babu Wax Statue In Madame Tussauds మహేష్ కి బాహుబలే కావాలా..?
Advertisement
Ads by CJ

క్రికెటర్స్, బాలీవుడ్ సెలబ్రిటీస్ ఏమిటి.. అనేక రంగాల్లో ప్రతిభ చూపించే వారి మైనపు విగ్రహాలు ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తెగ కొలువు తీరుతున్నాయి. షారుఖ్  ఖాన్, ఐశ్వర్య రాయ్.. పద్మావతీ చిత్రంతో దీపికా పదుకొనె, షాహిద్ కపూర్ ల మైనపు బొమ్మలే కాదు ... సౌత్ హీరోల్లో బాహుబలితో ప్రభంజనం సృష్టించిన ప్రభాస్ మైనపు బొమ్మ కూడా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోకి అతి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి బాలీవుడ్ వారు మాత్రమే అందుకునే ఈ అరుదైన గౌరవాన్ని మన హీరోలు కూడా సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలిలా ప్రపంచ వ్యాప్తి గుర్తింపుతో.. ప్రభాస్ మైనపు బొమ్మ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతి త్వరలోనే కొలువు తీరనుంది. ఇప్పటికే ప్రభాస్ మైనపు బొమ్మ తయారీలో ఉంది.. మరి బాహుబలి సినిమా రేంజ్ ఏమిటో ప్రభాస్ మైనపు బొమ్మే చెబుతుంది.

ఇక తాజాగా బాహుబలి లాంటి ఇండియన్ మూవీలో నటించకపోయినా.. కేవలం తెలుగు సినిమాలు మత్రమే చేస్తూ అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు మైనపు విగ్రహం కూడా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు తీరనుంది. మైనపు విగ్రహాలు అసలు మనిషి ఎలా ఉంటాడో అదే తీరుగా అంటే అందంగా ఉంటుంది. ఇక కేవలం ఆ బొమ్మకు ప్రాణం మాత్రమే ఉండదు.. కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నమాట. మరి అంతటి అరుదైన గౌరవాన్ని ఇప్పుడు మన మహేష్ కూడా సొంతం చేసుకున్నారు. మూడు నెలల క్రితమే తన బాడీ మెజర్మెంట్స్ ని మేడమ్ టుస్సాడ్స్ వారికి అందించిన మహేష్.. మైనపు బొమ్మ ఎంతందంగా తయారు చేస్తున్నారో మేకింగ్ ఫోటో ఒకటి సోషల్ ఇండియాలో వైరల్ అయ్యింది. 

మహేష్ అందమైన మొహాన్ని ఇవాన్ రీస్ అనే కళాకారుడు ఎంతందంగా తయారు చేస్తున్నాడో ఆ ఫొటోలో కనబడుతుంది. అచ్చం మహేష్ మాదిరిగా ఉన్న ఆ ఫోటో అందరిని ఆకర్షిస్తుంది. రొమాంటిక్ స్టైల్ లో మెస్మరైజ్డ్ లుక్స్‌తో మహేష్ ఫేస్‌ కనబడుతుంది. మరి మహేష్ మైనపు బొమ్మకు ఫినిషింగ్ పూర్తికాగానే... మహేష్ మైనపు విగ్రహావిష్కరణకు ముహూర్తం పెడతారని చెబుతున్నారు. ఏదైనా టాలీవుడ్ సినిమాలతోనే ఇంత క్రేజ్ సంపాదించిన మహేష్ ఎంతైనా గ్రేట్ కదా.

Sneak Peek Of Mahesh Babu Wax Statue In Madame Tussauds:

Sneak Peek: Mahesh Babu Wax Statue  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ