Advertisementt

సాక్ష్యం ఆట ఆగింది!!

Fri 27th Jul 2018 02:18 PM
  సాక్ష్యం ఆట ఆగింది!!
Saakshyam Shows Cancelled సాక్ష్యం ఆట ఆగింది!!
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీనివాస్ - పూజా హెగ్డే జంటగా.. శ్రీవాస్ దర్శకుడిగా తెరకెక్కిన సాక్ష్యం సినిమా ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. భారీ అంచనాలు, భారీ క్రేజ్ మధ్యన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాక్ష్యం సినిమా మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి . లేదంటే ఈపాటికి ఐ మాక్స్ వంటి మల్టిప్లెక్స్ లో సాక్ష్యం బొమ్మ పడడమే కాదు.... సినిమా లైవ్ అప్ డేట్స్ కూడా వచ్చేసుండేవి. కానీ సాక్ష్యం సినిమా షోస్ క్యాన్సిల్ అవడం వలన సాక్ష్యం సినిమా కోసం టికెట్స్ బుక్ చేసుకున్న వారు ఉసూరుమంటూ.. థియేటర్స్ కి వచ్చి మరీ వెనుదిరిపోతున్నారు. అయితే సాక్ష్యం సినిమా విడుదలకు ఫైనాన్స్ ఇష్యుస్ ఏవో ఉన్నాయనే టాక్ అయితే వినబడుతుంది.

అందుకే ఇంతవరకు థియేటర్స్ కి సాక్ష్యం ప్రింట్ రాలేదంటున్నారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, సీడెడ్, ఓవర్సీస్ ఇలా ఏ ప్రాంతంలోనూ సాక్ష్యం సినిమా మార్నింగ్ షోస్ పడలేదు. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రింట్ ఇంకా థియేటర్స్ కి చేరలేదంటే.. ఫైనాన్స్ ఇష్యుస్ నిజమే అనిపిస్తుంది. మరి బెల్లంకొండ సురేష్ వంటి నిర్మాత కొడుకు సినిమాకే ఇలాంటి పరిస్థితి వస్తే మాములు హీరోల పరిస్థితి ఏమిటో కదా. ఇక మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయినా... మ్యాట్నీ షో కల్లా సాక్ష్యం ప్రేక్షకులముందుకు తెచ్చేందుకు తంటాలు పడుతున్నారు. చివరికి ఐ మాక్స్ లో మీడియా కోసం వేసిన షో కూడా క్యాన్సిల్ అయ్యింది. 

Saakshyam Shows Cancelled:

Saakshyam Morning Shows Cancelled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ