జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌పై వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. ప్రతి ఒక్కరు జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇక దీనిపై మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఎంత ఈమధ్య గ్యాప్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు పవన్ మీద ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయలేదు. పవన్ కూడా లోకేష్, టిడిపిల అవినీతి, ఇతర తప్పులను ప్రశ్నిస్తున్నాడే గానీ వ్యక్తిగత విమర్శల జోలికి పోవడం లేదు. ఈ పరిణామం చివరకు ఎక్కడకు దారి తీస్తుంది? పవన్ అభిమానులు జగన్‌ని ఎలా టార్గెట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు, పవన్‌లకు ఉన్న హుందాతనం వైసీపీ నాయకులకు ఉండటం లేదు. ఇటీవల ఓ వైసీపీ నాయకురాలు బొల్లి వ్యాధి ఉన్న వారు పాలిస్తే రాష్ట్రానికి అరిష్టం అంటూ చంద్రబాబును టార్గెట్ చేయడం దారుణం. ఇక జగన్ వ్యాఖ్యలపై మేధావి, మంచి రాజకీయనాయకుడిగా పేరుతెచ్చుకున్న ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించాడు. పవన్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలను నేను చూడలేదు. కానీ పత్రికల్లో చదివాను. పత్రికల్లో వచ్చినట్లే జగన్ మాట్లాడి ఉంటే అది వందశాతం తప్పు.
పవన్‌ది తప్పు అని ఎవరైనా భావిస్తే దానికి లీగల్ పద్దతుల ద్వారా ఎదుర్కోవాలి. దానిని అనేక పద్దతులు ఉన్నాయి. లీడర్ ఎప్పుడు మార్గదర్శకుడిగా ఉండాలి. తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు.. అలా చేయవద్దని చెప్పాలి జగన్ మాట్లాడినది పూర్తిగా తప్పు అనే విషయంలో రెండో ఆలోచన లేదు. పవన్‌కి ఎందరు పెళ్లాలు ఉన్నారనేది ఆ పెళ్లాలే తేల్చుకోవాలి తప్ప నీవు కాదు. ఇది చట్టం చెబుతోంది. ఏ పెళ్లాన్ని అయినా హింసపెట్టి ఉంటే ఆమె కోర్టుకి వెళ్లవచ్చు. అంతేగానీ దానిపై కామెంట్ చేసే హక్కు మనకి లేదు. జగన్ ఎందుకిల్లా మాట్లాడుతున్నాడనేది చెప్పడానికి నా వద్ద జ్యోతిష్య శక్తి లేదు. ఇలాంటి విమర్శలు చేసుకోవడం వైసీపీకి మంచిది కాదు అని తేల్చిచెప్పారు.