Advertisementt

దొర ఆనంద్, దొరసాని శివాత్మిక..!

Fri 27th Jul 2018 12:31 PM
anand devarakonda,shivatmika,dorasani movie,vijay devarakonda,brother  దొర ఆనంద్, దొరసాని  శివాత్మిక..!
Shivatmika in Vijay Devarakonda Brother Film దొర ఆనంద్, దొరసాని శివాత్మిక..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ అద్భుతమైన సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 'పెళ్లి చూపులు' సినిమాలో సహజమైన నటనతో మార్కులు వేయించుకున్న విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాలో అదరగొట్టే నటనతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ హవా మాములుగా లేదు. అర్జున్ రెడ్డి తో అదరగొట్టే ట్రెండ్ సెట్ చేసిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు తన తమ్ముణ్ణి కూడా హీరోగా ఇండస్ట్రీలోకి దింపుతున్నాడు. విజయ్ పోలికలతో ఉన్న ఆనంద్ దేవ‌ర‌కొండ హీరో అవుతాడంటూ ఎప్పటినుండో వార్తలొస్తున్నాయి.

తాజాగా ఆనంద్ దేవ‌ర‌కొండ 'దొరసాని' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మాణంలో మ‌ధుర శ్రీధ‌ర్, య‌ష్ రంగినేని సమర్పణలో ఆనంద్ హీరోగా కేవీఆర్ మ‌హేంద్ర దర్శకుడిగా ఈ 'దొరసాని' సినిమా తెరకెక్కబోతోంది. తెలంగాణ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కబోయే ఈ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ప్రస్తుతం నటనలో ట్రైనింగ్ తీసుకున్న ఆనంద్ దేవరకొండ హీరోగా ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమాకి అందరూ కొత్తవాళ్లే కావడం మరో విశేషం. దర్శకుడు మ‌హేంద్ర ఈ సినిమాతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అలాగే హీరో ఆనంద్ దేవరకొండ.

ఇంకా ఆనంద్ దేవరకొండ కి హీరోయిన్ కూడా సెట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇంతకీ ఆనంద్ పక్కన నటించబోయే ఆ బ్యూటీ ఎవరో కాదు రాజశేఖర్, జీవితాల చిన్న కూతురు శివాత్మిక. ఇప్పటికే పెద్ద కూతురు శివాని అడివి శేష్ తో కలిసి '2 స్టేట్స్' తో వెండితెర అరంగేట్రం చేయబోతోంది. మరి ఇప్పుడు  శివాత్మిక కూడా వెండితెరను ఏలడానికి రెడీ అయ్యింది. ఇక ఆనంద్ దేవరకొండ  శివాత్మికలు కలిసి 'దొరసాని' సినిమాతో వెండితెరకు గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

Shivatmika in Vijay Devarakonda Brother Film:

Anand and Shivatmika in Dorasani 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ