'ఆది' చిత్రం తర్వాత వినాయక్ బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో 'చెన్నకేశవరెడ్డి' అనే చిత్రం తీశాడు. ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినా కూడా బాలయ్య పోషించిన పెద్దవాడి పాత్రను మాత్రం అత్యంత పవర్‌ఫుల్‌గా వినాయక్ చూపించాడు. శరభ..శరభ.. అంటూ బ్యాగ్రౌండ్‌లో వచ్చే ఆర్‌ఆర్‌ని కూడా ప్రేక్షకులు మర్చిపోలేదు.
ఇక విషయానికి వస్తే హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో బిల్డప్ చేస్తూ పవర్‌ఫుల్ డైలాగ్స్ రాయడంలో సుప్రసిద్దులు ఎంతో సీనియర్లయిన పరుచూరి బ్రదర్స్. తాజాగా వీరిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'ఆది' తర్వాత నేను వినాయక్ తీసిన 'చెన్నకేశవరెడ్డి'కి కూడా మాటలు రాశాను. ఓ వెర్షన్ రాసి వినాయక్‌కి ఇచ్చాను. తర్వాత నా పనిలో నేను బిజీ అయ్యాను. కొన్నిసార్లు వినాయక్ వచ్చి సీన్ చెబితే అప్పటికప్పుడు డైలాగ్స్ రాసి ఇచ్చేవాడిని. ఈ సినిమా సెన్సార్‌కి వెళ్లినప్పుడు నేను ఉలిక్కిపడేలా వినయ్ ఓ పని చేశాడు.
ఈ సినిమాలోని ఓ డైలాగ్ గురించి సెన్సార్ అధికారి ఒకరు నాతో ప్రస్తావించాడు. విలన్ ఓ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత ఓ డైలాగ్ అంటాడు. ఆ మాట నేను రాయలేదు. ఏమయ్యా వినాయక్ ... ఇలా చేశావు? అని అడిగాను. అందుకు అతను ఓ కారణం చెప్పాడు. ఏదైతేనేం ఆ సినిమా కూడా బాగానే ఆడింది అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి అంత సీనియర్లయిన పరుచూరి బ్రదర్స్ పరువును వినాయక్ ఒకే డైలాగ్‌తో తీసి వేశాడని అనుకోవచ్చునేమో...!