'రంగస్థలం' చిత్రంతో తొలిసారిగా విమర్శకుల ప్రశంసలు, ప్రతి ఒక్కరి పొగడ్తలను పొంది తనలోని అసలైన నటుడిని బయటకు తెచ్చాడు రామ్‌చరణ్. ఎంతోకాలం తర్వాత నిజంగా శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ఇది రికార్డు పుటల్లోకి ఎక్కడమే కాదు... ఇంటా బయటా కూడా తన స్టామినాని పెంచుకుని ఓవర్‌సీస్ ప్రేక్షకులను కూడా చిట్టిబాబు మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ చిత్రం కలెక్షన్ల పరంగా 'నాన్ బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో వరుసగా'ధృవ, రంగస్థలం' వంటి విభిన్న చిత్రాలలో నటించిన ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా డివివి పతాకంపై రూపొందుతున్న చిత్రంలో నటిస్తూ ఉండటంతో ఇది మరలా ఆయన రెగ్యులర్ ఫార్మెట్‌లోకి వచ్చి చేస్తున్న మాస్... ఊరమాస్ చిత్రంగా అందరు భావించారు. అందునా బోయపాటి చిత్రం అంటే అందరు అదే ఊహిస్తారు.
కానీ ఈ చిత్రంలో కూడా చిట్టిబాబు తన కూల్ యాంగిల్‌ని మరోసారి తెరపై చూపించనున్నాడని తాజాగా లీక్ అయిన షూటింగ్ స్పాట్ ఫొటోని బట్టి అర్ధమవుతోంది. ఇక ఇందులో అన్నావదినలతో చరణ్‌కి ఉండే ఎమోషన్స్‌ని కూడా ఫ్యామిలీలకు నచ్చే విధంగా తీస్తున్నారని సమాచారం. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మరోసారి సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్‌ని అందిస్తున్నాడట. ఇక లీకైన ఫొటోలో చరణ్ పంచెకట్టుతో దేవాలయంలో కనిపిస్తూ ఉన్నాడు. అంటే చిట్టిబాబుగా లుంగీ ఎగ్గట్టిన చరణ్ ఈ చిత్రంలో సంప్రదాయ తెలుగు కుర్రాడిలా కనిపిస్తుండటంతో ఈ చిత్రంపై కూడా అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
ఇక ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని పంద్రాగష్టుకి విడుదల చేసి, సినిమాని వచ్చే సంక్రాంతి బరిలోకి దింపనున్నారు. మరి ఈసారి చరణ్ మరో హిట్ కొడితే ఆయన ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్లే.