Advertisementt

యన్.టి.ఆర్ లో నవరస నటనా సార్వభౌముడు!

Thu 26th Jul 2018 02:12 PM
kaikala satyanarayana,ntr,ntr biopic,hm reddy  యన్.టి.ఆర్ లో నవరస నటనా సార్వభౌముడు!
Kaikala Satyanarayana As HM Reddy In NTR Biopic యన్.టి.ఆర్ లో నవరస నటనా సార్వభౌముడు!
Advertisement
Ads by CJ

యన్.టి.ఆర్ లో హెచ్.ఎం.రెడ్డిగా నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ !!

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ బయోపిక్ మొదటి షెడ్యూల్ నిన్నటితో పూర్తవ్వగా.. ఈ చిత్రంలో నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ ప్రఖ్యాత చిత్ర నిర్మాత, తెలుగు సినిమా పితామహుడు అయిన హెచ్.ఎం.రెడ్డి పాత్రను పోషిస్తున్నారు. తన నటనతో వందలాది చిత్రాల్లోని పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన కైకాల సత్యనారాయణ యన్.టి.ఆర్ బయోపిక్ లో హెచ్.ఎం.రెడ్డిగా అద్భుతంగా నటించారు. ఆ మహానుభావుడి పాత్రను ఈ మహానటుడు అమోఘమైన పద్ధతిలో రంజింపజేశారని దర్శకుడు క్రిష్ తెలిపారు. కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సినిమాలో ఆయన లుక్ ను నేడు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. 

ఎన్.బి.కె స్టూడియోస్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ టైటిల్ రోల్ పోషిస్తుండడం విశేషం. 

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సాయికొర్రపాటి, విష్ణు ఇందూరు సమర్పిస్తున్నారు. 

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నరేష్ వి.కె, మురళీశర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు.

Kaikala Satyanarayana As HM Reddy In NTR Biopic:

>Introducing HM Reddy From NTR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ