Advertisementt

రాజమౌళి టీం వుండడానికో ఇల్లు..!

Thu 26th Jul 2018 12:09 AM
  రాజమౌళి టీం వుండడానికో ఇల్లు..!
Rs 2 Crore House For Rajamouli Team రాజమౌళి టీం వుండడానికో ఇల్లు..!
Advertisement
Ads by CJ

రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన రామ్ చరణ్ - ఎన్టీఆర్ మల్టీస్టారర్ పై బోలెడన్ని కబుర్లు నిత్యం మీడియాలో వినబడుతూనే ఉన్నాయి. రోజుకో న్యూస్ ఆ భారీ ప్రాజెక్ట్ పై హల్చల్ చేస్తుంది. మొన్నటి వరకు కథ, ఆ కథలోని పాత్రలపైనా, అలాగే హీరోయిన్స్ గురించిన వార్తలు మాత్రమే ప్రచారం జరిగితే తాజాగా.. రాజమౌళి ఈ బడా మల్టీస్టారర్ కోసం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉండడమే కాదు... ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథకు రిపేర్లు కూడా పూర్తి చేస్తున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమా కాబట్టి ఇద్దరి స్టార్ హీరోలను సినిమాలో ఒకే విధంగా చూపెడుతూ... ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా చూసుకోవడానికి రాజమౌళి చాలా టైం తీసుకుంటున్నాడట. ఎందుకంటే ఎవరి పాత్ర తక్కువైనా ఆ హీరో అభిమానుల నుండి రాజమౌళి తప్పించుకోలేడు గనక. అందుకే వారిద్దరి పాత్రలకు పూర్తిగా సమానంగా ఉండేలా పక్కాగా ఈ స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడట.

అలాగే మరోపక్క ఈ బడా మల్టీస్టారర్ కి సంబందించిన సెట్స్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశాడట.  బ్రిటిష్ కాలం నాటి నేపధ్యాన్ని వర్తమానంతో లింక్ చేస్తూ సరికొత్త ట్రీట్మెంట్ తో ఎవరూ ఊహించని స్టోరీ లైన్ రాబోతున్న రాజమౌళి హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాలలో ఈ సినిమాకి సంబందించిన సెట్ పనుల్లో నిమగ్నమయ్యాడట. అయితే పనిలో పనిగా రాజమౌళి తన కోసం అక్కడ ఒక టెంపరరీ ఇంటి నిర్మాణం కూడా చెప్పట్టాడట. ఎందుకంటే 300 కోట్ల ప్రాజెక్ట్ గనక చాలా పక్కాగా... ఈ సినిమా షూటింగ్ చెయ్యడం.. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఇంటికి వచ్చి షూటింగ్ కి వెళ్లడం... అందువలన షూటింగ్ కి టైం వేస్ట్ కావడమెందుకనుకున్నాడో ఏమోగానీ.. రాజమౌళి తన ఫ్యామిలీ కోసం సకల సౌకర్యాలతో ఒక ఇంటి నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తుంది. అది కూడా రెండు కోట్లు వెచ్చించి మరీ తన టెంపరరీ ఇంటిని రాజమౌళి సెట్ చేస్తున్నాడట. తన ఫ్యామిలీ సభ్యులకు తలో ఒక గదిని.. అలాగే ఒక ఆఫీస్ ని... అన్ని రకాలుగా అనువైనదిగా ఆ ఇల్లు నిర్మాణం జరుగుతోందట.

మరి ఎలాగూ తన ఫ్యామిలీ మొత్తం షూటింగ్ స్పాట్ లోనే ఉండాలి. ఎందుకంటే రాజమౌళి ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరు ఆయన సినిమా కోసం టెక్నీకల్ సైడ్ పనిచేసే వారే. రాజమౌళి అన్నలు, వదినలు, పిల్లలు, భార్య సైతం రాజమౌళి ప్రాజెక్ట్ కోసం కష్టపడతారు. అందుకే తన ఫ్యామిలీ అంతా ఆ సినిమా సెట్ కి దగ్గరగా ఉండేలా... అలాగే సినిమాకి సంబందించిన ప్రతి పని అక్కడ ఇంటిలోని ఆఫీస్ నుండే జరిగేలా రాజమౌళి ప్లాన్ చేసి మరి ఆ ఇంటి నిర్మాణం చేపట్టాడట. మరి రాజమౌళి ఏం చేసినా ఆయన నిర్మాతలకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. అందుకే దానయ్య కూడా రాజమౌళి చేస్తున్న పనికి అడ్డు చెప్పడం లేదట. మరి దానయ్య మూడొందల కోట్లు పెడితే... అంతకు రెండు రేట్ల లాభాలను రాజమౌళి ఆయనకు ఇచ్చే సత్తా ఉంది. అందుకే రాజమౌళి నిర్మాతల పాలిట దేవుడు. ఏదైనా రాజమౌళి సత్తా ముందు ఎంత పెట్టినా దండగలేదనేది నిర్మాతల ఫీలింగ్.

Rs 2 Crore House For Rajamouli Team:

Rajamouli Superb Decision for Charan and NTR MultiStarrer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ