ఇటీవలే నటి స్వీటీ అనుష్క ఓ కొత్తదర్శకుని చిత్రానికి ఓకే చెప్పిందని, ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కావడం, కథ బాగా ఉండటంతో అనుష్క అందులో నటించేందుకు ఓకే చెప్పిందని మాత్రమే కాక ఈ చిత్రంలో నాని కూడా కీలకపాత్రను పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నిజానికి తమిళంలో నయనతారలాగా తెలుగులో కథానాయిక ఆధారంగా రూపొందే లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు అనుష్కను కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకోవాలి. కథనంతా తన మీదనే సాగేలా తన భుజాలపై మోసే సత్తా ఉన్న నాయికగా ఈమె ఇప్పటికే 'అరుంధతి, రుద్రమదేవి, భాగమతి' వంటి చిత్రాల ద్వారా నిరూపించుకుంది.
ఇక తాజాగా ఈమె కొత్త దర్శకుడు హేమంత్ చెప్పిన ఓ సినిమాకి ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని కోన కార్పొరేషన్, పీపుల్స్‌మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. దీనిలో అనుష్క సరసన నటించేందుకు డ్రీమ్ బోయ్ మాధవన్‌ని ఎంపిక చేశారట. ప్రస్తుతం ఇన్నేళ్ల కెరీర్‌లో మాధవన్ పరభాషా చిత్రాల ద్వారా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ప్రస్తుతం ఇన్నేళ్ల తర్వాత ఆయన నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నాడు.
ఇక అనుష్క చిత్రంలో మాధవన్ నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని అనుష్కకి మంచి గుర్తింపు ఉన్న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా రూపొందించే వీలుందని తెలుస్తోంది. ఇవే గాక అనుష్క మరోరెండు చిత్రాలకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. 'భాగమతి'ని 'బాహుబలి' సమయంలో ఒప్పుకున్న తర్వాత అనుష్క ఆ తర్వాతి కాలంలో ఏ చిత్రంకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలే నిజమైతే అనుష్క మూడు చిత్రాలతో పాటు గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో మరో చిత్రంలో కూడా నటించే అవకాశాలున్నాయి.