Advertisementt

చెల్లెమ్మ ఇచ్చిన ఛాలెంజ్‌ని అన్నకి విసిరాడు!

Wed 25th Jul 2018 04:20 PM
ss rajamouli,kavitha challenge,harithaharam,ktr  చెల్లెమ్మ ఇచ్చిన ఛాలెంజ్‌ని అన్నకి విసిరాడు!
SS Rajamouli accepts Green challenge from MP Kavitha చెల్లెమ్మ ఇచ్చిన ఛాలెంజ్‌ని అన్నకి విసిరాడు!
Advertisement
Ads by CJ

నిన్నటి వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌కోహ్లితో సహా టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. దేశంలోని అందరు ఫిట్‌నెస్‌ సాధించి, వ్యాయామాలు చేసి మంచి ఆరోగ్యంగా ఉండాలని కేంద్రమంత్రి, మాజీ ఒలింపియన్‌ పతక విజేత రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్‌, ఆ తర్వాత సోషల్‌ మీడియా మొత్తం వైరల్‌ అయింది. 

తాజాగా టిఆర్‌ఎస్‌ ఎంపీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత హరితహారం ఛాలెంజ్‌ని ప్రారంభించి, దానిని దర్శకధీరుడు రాజమౌళికి విసిరింది. తాజాగా ఆయన ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, కవిత గారు... మీరు విసిరిన హరితహారం ఛాలెంజ్‌ని స్వీకరించాను. మర్రి, గొల్మోహర్‌, వేప మొక్కలను నాటాను. ఈ సందర్భంగా నేను పుల్లెల గోపీచంద్‌, కేటీఆర్‌, సినీ దర్శకుడు 'అర్జున్‌రెడ్డి' ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా, 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌లకు ఈ ఛాలెంజ్‌ని విసురుతున్నానని పేర్కొన్నాడు. 

ఈ సందర్భంగా జక్కన్న తాను మొక్కలు నాటుతున్న ఫొటోలను అప్‌లోడ్‌ చేశాడు. మరి ఈ ఛాలెంజ్‌ రాబోయే కాలంలో ఎందరిని ఇన్‌స్పైర్‌ చేయనుందో, ఎంతగా వైరల్‌ కానుందో వేచిచూడాల్సివుంది. 

SS Rajamouli accepts Green challenge from MP Kavitha :

Rajamouli said ok to Kavitha Challenge

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ