ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంత హాట్ టాపిక్ అయ్యాడో.. ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన రెండో పెళ్లి వ్యవహారంతో అంతే హాట్ టాపిక్ అయ్యింది. పవన్ తో విడిపోయాక ఒంటరిగా ఉంటున్న రేణు దేశాయ్ సడన్ గా రెండో పెళ్లి చేసుకుంటున్నట్లుగా చెప్పిందో లేదో ఆమెపై సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ విరుచుకుపడ్డారు. అయినా బెదరని రేణు దేశాయ్ తన రెండో పెళ్లి ఏర్పాట్లను షురూ చేసింది. గతంలో పవన్ తో ప్రేమ, పెళ్ళికి ముందు ఆమె సినిమా హీరోయిన్. పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి.. పవన్ తో ప్రేమలో పడి.. సినిమాలకు దూరమైంది. ఇక పవన్ తో విడిపోయాక.. చాన్నాళ్ళకి ఒక సినిమా చేసిన రేణు దేశాయ్ మా టివి లో ఒక డాన్స్ షో కి మళ్ళీ జడ్జ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయినా ఎప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండే రేణు దేశాయ్ ఇప్పుడు రెండో పెళ్లితో మళ్ళీ హాట్ హాట్ గా అందరి నోళ్ళలో నానుతుంది. ఇక తనకు కాబోయే వరుడిని ఎవరికీ చూపెట్టకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్న రేణు దేశాయ్ మరోసారి సినిమాల్లోకి రాబోతుందంటూ ఒక వార్త నిన్నటినుండి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. రెండో పెళ్లి తర్వాత రేణు దేశాయ్ మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లోను గట్టిగానే వినబడుతుంది. మరి ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన రేణు ఇప్పుడు తన వయసును దృష్టిలో పెట్టుకుని... సీనియర్ పాత్రలు అంటే.. అక్క, వదిన రోల్స్‌తో మెప్పించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే రేణు దేశాయ్ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా... నిర్మాతలు కూడా రేణు డెసిషన్ కి ఫిదా అయ్యి ఆమె చుట్టూ తిరుగుతున్నట్లుగా చెబుతున్నారు. అలాగే ఒక యంగ్ హీరో సినిమాలో ఆ హీరో గారికి వదినగా రేణు దేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి నిజంగానే.. రేణు దేశాయ్ సినిమాల్లోకి మళ్ళీ వస్తుందా... ఒకవేళ వస్తే పవన్ కళ్యాణ్ ఫాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ఎందుకంటే రేణు దేశాయ్ ఏం చేసినా వారికీ తప్పే కదా...!