Advertisementt

ఏదీ దాచుకోలేదు: షకీలా!

Tue 24th Jul 2018 12:19 PM
shakeela,biopic,richa chadha  ఏదీ దాచుకోలేదు: షకీలా!
Shakeela Talks About her Biopic ఏదీ దాచుకోలేదు: షకీలా!
Advertisement
Ads by CJ

ఒకరి జీవితాన్ని బయోపిక్‌గా తీయాలంటే వారి జీవితం సాఫీగా సాగి ఉంటే పెద్దగా కిక్‌ ఉండదు. అయితే ఎవరి జీవితాలు అయితే సినిమాటిక్‌గా, పలు వివాదాలు, సంచలనాలు ఉంటాయో వాటిని సరిగ్గా ప్రజెంట్‌ చేస్తే మాత్రం డోకా ఉండదు. ఇక సిల్క్‌స్మిత జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన 'డర్టీ పిక్చర్‌' చిత్రం విద్యాబాలన్‌కి ఎంత గుర్తింపును తెచ్చింది. ఎంత పెద్ద సక్సెస్‌ అయింది అనేది తెలిసిందే. ముఖ్యంగా అన్ని భాషల వారిని అలరించే వారి జీవితాలను తీస్తే వర్కౌట్‌ అవుతోంది. తాజాగా సన్నిలియోన్‌ జీవిత చరిత్ర నేపధ్యంలో వెబ్‌సిరీస్‌ వస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక మరోవైపు దక్షిణాదిలో శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన షకీలా జీవిత చరిత్ర కూడా వెండితెరపై కనిపించడానికి రెడీ అవుతోంది. ఆల్‌రెడీ షకీలా దానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నేడు సన్నిలియోన్‌ అంత ఫేమస్‌ కాకపోయిన నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా ఒకానొక సందర్భంలో మలయాళంలోని టాప్‌స్టార్స్‌కి కూడా పోటీ ఇచ్చింది. తాను నటించే పెద్దల చిత్రాలతో మోహన్‌లాల్‌, మమ్ముట్టిలు సైతం ఆమె రిలీజ్‌ డేట్‌తో తమ సినిమాలు క్లాష్‌ కాకుండా చూసుకునే వారు. ఇక ఈమెపై దాదాపు అనధికార నిషేధం విధించిన తర్వాత ఈమె తెలుగు పరిశ్రమకు వచ్చింది. షకీలా జీవిత చరిత్రను లంకేష్‌ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో షకీలా పాత్రను రిచా చద్దా పోషిస్తోంది. 

షకీలా తాజాగా తన పాత్రను పోషిస్తున్న రిచా చద్దాని కలిసింది. రిచా కూడా నాలాగే ధైర్యవంతురాలు. స్క్రిప్ట్‌ని పూర్తిగా అర్ధం చేసుకుని నటించగలదు. ఈ సినిమాకి సంబంధించిన నా వృత్తి, వ్యక్తిగత విషయాలను వేటిని దాచలేదు. నా జీవితంలో జరిగిన ప్రతి ఘటనను దర్శకనిర్మాతలకు చెప్పాను. నిజాలు దాచి బయోపిక్‌ తీస్తే దానికి అర్ధం ఉండదు అని చెప్పుకొచ్చింది. ఇక ఈమె నటించిన 250వ చిత్రం 'శీలవతి' చిత్రం సెన్సార్‌ చిక్కుల్లో ఉంది. మరి ఇది ఎప్పుడు విడుదల అవుతుందో వేచిచూడాల్సివుంది...!

Shakeela Talks About her Biopic:

Shakeela Biopic Starts Soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ