Advertisementt

హీరోయిన్ కు పేరొస్తుందని రాజకీయమా..?

Mon 23rd Jul 2018 08:56 PM
rx 100,payal rajput,heroine,politics,ajay bhupati  హీరోయిన్ కు పేరొస్తుందని రాజకీయమా..?
No Heroine Photo in RX 100 Poster హీరోయిన్ కు పేరొస్తుందని రాజకీయమా..?
Advertisement
Ads by CJ

కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం 'ఆర్ఎక్స్ 100′. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మౌత్ టాక్ తో దూసుకుపోతుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్రం టీం విజయయాత్రను చేపడుతోంది.

ఈ సందర్భంగా ఈ చిత్రం యొక్క పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోరింగ్ బ్లాక్ బ్లాస్టర్ పేరుతో విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఈ చిత్రంకి పని చేసిన ముఖ్యమైన టెక్నిషియన్స్ తో పాటు హీరో, డైరెక్టర్, నిర్మాత ఫొటోలు కనిపించాయి కాని హీరోయిన్ పాయల్ ఫొటో లేదు. 

దాంతో ప్రస్తుతం ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెలువడుతున్నాయి. ఈ చిత్రం హిట్ అవ్వటానికి మెయిన్ కారణం హీరోయిన్ అని ఒప్పుకోవాల్సిందే. కానీ అలాంటిది హీరోయిన్ ఫోటో ఆ పోస్టర్ లో లేకపోవడంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. థియేటర్స్ కు యూత్ ని రప్పించడంలో పాయల్ ది కీలక పాత్ర అని తెలిసిందే. మరి ఈ పోస్టర్ లో హీరోయిన్ ఫోటో కావాలనే పెట్టలేదా.. లేదా పొరపాటున టీమ్ మర్చిపోయిందా అన్న విషయం తెలియాల్సి వుంది.

No Heroine Photo in RX 100 Poster:

RX 100 Team Deletes Heroine Payal Photo in Poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ