Advertisementt

ఆ కామెంట్స్ ఏంటంటూ.. నాని క్లాస్..!

Mon 23rd Jul 2018 07:45 PM
  ఆ కామెంట్స్ ఏంటంటూ.. నాని క్లాస్..!
Nani Class to Netizens at Bigg Boss House ఆ కామెంట్స్ ఏంటంటూ.. నాని క్లాస్..!
Advertisement
Ads by CJ

ఎవరి అభిమాన హీరోలు వారికి దేవుళ్లు కావచ్చు. కానీ ఎదుటి హీరోల మీద నీచమైన భాష మాట్లాడటం మాత్రం సరికాదు. ఇక ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాను వాడే ఉన్నత చదువులు చదివిన వారు కూడా కులం పేరిట గ్రూప్‌లు పెట్టుకుంటున్నారు. ఒకానొక దశలో సీనియర్‌ ఎన్టీఆర్‌కి నాని నివాళి అందిస్తే.. నాని కులం ఏమిటి? అని నెటిజన్లు కామెంట్‌ చేశారు. దానిపై నాని కూడా ధీటుగా స్పందిస్తూ నాకు ఎన్టీఆర్‌ మాత్రమే కాదు... చిరంజీవితో పాటు అందరూ ఇష్టమే. ఎన్టీఆర్‌కి నివాళి అందించినంత మాత్రాన నా కులం గురించి ఎందుకు మాట్లాడుతారు? అని గట్టిగా ప్రశ్నించాడు. 

ఇక తాజాగా విషయానికి వస్తే నాని బిగ్‌బాస్‌ సీజన్‌2ని హోస్ట్‌ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన నెటిజన్లు వాడే అసభ్యకర వ్యాఖ్యలపై మండిపడ్డాడు. బిగ్‌బాస్‌ ఇంటిలోని అందరు ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు. ఆ విషయాన్ని చెప్పవచ్చు. కానీ అసభ్యపదజాలం వాడటం మాత్రం సరికాదు. తేజస్విపై వస్తున్న కామెంట్స్‌ వింటుంటే బాధగా ఉంది. బయట ఇలాంటి మనుషులు ఉన్నారా? అనిపిస్తోంది. కామెంట్స్‌ చేయడానికి కూడా ఓ హద్దు ఉంటుందని నెటిజన్లకు క్లాస్‌ తీసుకున్నాడు. 

ఇక తాజాగా జరిగిన బిస్‌బాస్‌ ఎపిసోడ్‌లో వైఫ్‌ ఆఫ్‌ రామ్‌ సినిమా ప్రమోషన్‌ నిమిత్తం మంచు లక్ష్మి బిగ్‌బాస్‌ హౌస్‌ పార్టిసిపెంట్స్‌తో సరదాగా గడిపింది. లక్ష్మి కోసం రోల్‌రైడా ఓ పాటను పాడాడు. గణేష్‌ ఆర్జేగా అవతారం ఎత్తాడు. ఈసారి నానికి బదులు మంచు లక్ష్మి ఎలిమినేషన్‌ని ప్రకటించింది. తేజస్వి పేరు చెప్పగానే హౌస్‌లోని వాతావరణం మారిపోయింది. అందరు కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా సామ్రాట్‌కి నోట మాటరాలేదు. షో చివరి వరకు మూడీగానే ఉన్నాడు. ఇక తేజస్వి వెళ్తూ వెళ్తూ గణేష్‌పై బిగ్‌బాంబ్‌ని విసిరింది. గణేష్‌ ఒక వారం అంతా పాల సీసాతో నీళ్లు తాగాల్సి వుంటుంది...! 

Nani Class to Netizens at Bigg Boss House:

Bigg house Host Nani Fires on Netizens About Tejaswi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ