Advertisementt

ఈ టైమ్ అప్పేమిటో మాకర్థం కావట్లేదు..!

Mon 23rd Jul 2018 07:21 PM
  ఈ టైమ్ అప్పేమిటో మాకర్థం కావట్లేదు..!
Srinivasa Kalyanam Movie Teaser Released ఈ టైమ్ అప్పేమిటో మాకర్థం కావట్లేదు..!
Advertisement
Ads by CJ

ఓ కుటుంబ కధా చిత్రంగా, లవ్‌, ఎమోషన్స్‌ వంటివి జోడించి గతంలో శర్వానంద్‌తో దిల్‌రాజు తీసిన 'శతమానం భవతి' చిత్రం భారీ పోటీలో విడుదలై కలెక్షన్లనే కాదు.. జాతీయ అవార్డును కూడా సాధించింది. ఆ చిత్రానికి సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు.. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలోనే 'దిల్‌' తర్వాత 15ఏళ్ల గ్యాప్‌ తీసుకుని మరలా నితిన్‌ హీరోగా 'శ్రీనివాసకళ్యాణం' చిత్రం తీస్తున్నాడు. తాను గ్లామర్‌ షోనే కాదు.. నటిగా కూడా మెప్పించగలనని 'తొలిప్రేమ' చిత్రంతో నిరూపించిన రాశిఖన్నా ఇందులో హీరోయిన్‌. గతంలో ఇదే టైటిల్‌తో వెంకటేష్‌, భానుప్రియ, గౌతమి జంటగా ఓ చిత్రం వచ్చి ఘనవిజయం సాధించింది. 

ఇక ఈ చిత్రం కూడా కుటుంబ బంధాలు, అనుబంధాలు, విలువల పైనే తీస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో నితిన్‌, రాశిఖన్నా ప్రేమను అందంగా చూపించారు. 'సాయంత్రం మీరు మీ టైమ్‌ ఓ రెండు గంటలు అప్పుగా ఇవ్వాలని నితిన్‌ అంటే... రాశిఖన్నా స్పందిస్తూ ఈ టైం అప్పు ఏమిటి? అని ప్రశ్నిస్తుంది. దానికి హీరో మీ టైం మీది. అది నాకు ఇవ్వాలంటే మరి అప్పుగానే ఇవ్వాలి' కదా అనడం.. ఆ సంభాషణలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగష్టు9న విడుదల చేస్తున్నారు. పక్కరోజు అంటే ఆగష్టు10న విశ్వరూపం2 విడుదల కానుండగా, మరోవైపు గీతగోవిందం, సవ్యసాచి వంటి చిత్రాలు కూడా ఒక వారంలో క్యూకడుతున్నాయి. 

ఇక 'లై, ఛల్‌మోహన్ రంగ' వంటి ఫ్లాప్స్‌తో ఉన్న నితిన్‌కి ఇది ఖచ్చితంగా హిట్‌ కావాల్సి ఉంది. మరోవైపు 'తొలిప్రేమ'లో తన నటనను మరోసారి నిరూపించుకోవాల్సిన బాధ్యత రాశిఖన్నాపై ఉంది. ఇక ఈ చిత్రం వేడుకకు వచ్చిన వారికి దిల్‌రాజు ప్రత్యేక బహుమతులు ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన వారికి సారె పెట్టడం ఆనవాయితీ. అందుకే ఈ చిత్రం ఆడియో వేడుకకు వచ్చే అతిధులు, ముఖ్యులకు సారె పెట్టి దిల్‌రాజు ఆనందం కలిగించాడు. 

Click Here For Teaser

Srinivasa Kalyanam Movie Teaser Released:

Srinivasa Kalyanam Movie Teaser Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ