Advertisementt

‘గూఢచారి' రైట్స్ ఆయన చేతుల్లోకి..!

Mon 23rd Jul 2018 02:42 PM
producer anil sunkara,distribution rights,goodachari,adivi seshu  ‘గూఢచారి' రైట్స్ ఆయన చేతుల్లోకి..!
Anil Sunkara bags ‘Goodachari’ rights ‘గూఢచారి' రైట్స్ ఆయన చేతుల్లోకి..!
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గూఢచారి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని దక్కించుకున్నారు.. ఆయన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ పతాకం అసోసియేషన్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్  4 మిలియన్ వ్యూస్ తో అందరి దృష్టి ఆకర్షించగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.. ఇప్పటికైతే ఈ విషయం అధికారికంగా ధృవీకరించ లేదు కానీ ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ అవబోతున్నట్లు తెలుస్తుంది.. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించగా మొత్తం 116 రోజులలో 158 డిఫరెంట్ లొకేషన్ లలో హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమా రూపొందించబడింది.

శశి కిరణ్ టిక్కా దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించగా, 2013 మిస్ ఇండియా అయిన శోభిత ధూళిపాళ టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది.. ఒకప్పటి హీరోయిన్ సుప్రియా యార్లగడ్డ 20 సంవత్సరాల తర్వాత  ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం.. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు విస్టా డ్రీమ్ మర్చంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

Anil Sunkara bags ‘Goodachari’ rights:

Producer Anil Sunkara has Bagged the Distribution Rights of ‘Goodachari’ movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ