'రంగస్థలం' 80, 90 దశకాలకు చెందిన సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాను బేస్ చేసుకునే ఇప్పుడు చాలామంది దర్శకులు 80,90 దశకాలకు వెళ్లిపోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వైజాగ్ నేపథ్యంలో సాగే 90 బ్యాక్ డ్రాప్ కథట. మరోవైపు 'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల సైతం ఇలాంటి లైన్ లోనే ఒక పొలిటికల్ స్టోరీతో ఇటీవలే సాయి పల్లవిని ఒపించాడంట. ప్రస్తుతం హీరో వేట కొనసాగుతుంది.
ఇక అలానే రీసెంట్ గా 'గరుడవేగ'తో కమ్ బ్యాక్ అయిన రాజశేఖర్ కూడా ఇదే రూట్ లో వెళ్లబోతున్నాడట. తొలి చిత్రంతోనే ప్రేక్షకులు మరియు క్రిటిక్స్ ను మెప్పించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ చేయబోయే సినిమాలో 1970 నాటి కాలం ఉంటుందట. పోలీస్ యాక్షన్ కథగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం 'క్వీన్' రీమేక్ లో ఉన్న ప్రశాంత్ వర్మ త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ లో షూటింగ్ ని ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.
బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా 'గరుడవేగ' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా సేఫ్ కాలేదు. ఈ సినిమా వల్ల ప్రొడ్యూసర్స్ సేఫ్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమా విషయంలో బడ్జెట్ ఎక్కువ కాకుండా చూసుకోవాలని రాజశేఖర్ డైరెక్టర్ కు చెప్పాడంట. రాజశేఖర్ స్టార్ గా మారింది 'అంకుశం' సినిమా పోలీస్ ఆఫీసర్ పాత్ర వల్లే. అందుకే మళ్లీ అతనితో పోలీస్ ఆఫీసర్ కథను తీయాలని ప్రశాంత్ అనుకున్నాడంట. ఆ మధ్య రెండు మూడు సినిమాలు ఖాకీ డ్రెస్ లో చేశాడు కానీ అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. అందుకే ఈ సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట ప్రశాంత్.