సాధారణంగా సినిమా కథలన్ని రెండు మూడు పాయింట్ల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇటీవల కాస్త వైవిధ్యభరితమైన చిత్రాలు వస్తున్నప్పటికీ అవి ఎంతో కష్టంతోనే సాధ్యమవుతోంది. వీటిశాతం 2,3 శాతానికి మించి ఉండవు. మిగిలిన చిత్రాలన్నీ మన పాత చిత్రాలను కాస్త అటు ఇటు మార్చి తీయడమో, లేక దుష్టశిక్షణ, శిక్షరక్షణ, రామాయణం, భాగవతం, భారతం వంటి ఇతిహాసాలు చుట్టూనే నడుస్తూ ఉంటాయి. ఇక అప్పుడప్పుడు వచ్చే ట్రెండ్ సెట్ చేసే చిత్రాలైన 'బాషా' వంటి వాటిని కూడా అటు ఇటు మార్చి, బ్యాక్‌డ్రాప్‌ని కొత్తగా, యాక్షన్ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాపఫ్‌లు తీసుకుని 'సమరసింహరెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, సింహాద్రి, సాంబ'ఇలా వస్తూనే ఉంటాయి. కాకపోతే కాస్త స్క్రీన్‌ప్లేని కొత్తగా చూసుకునే దర్శకులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు.
ఇక విదేశీ చిత్రాల కథలను ఎత్తిపోతల పథకం కింద దించేవారు. పలు నాటికలు, కథానికలు, మనదేశంలోని చిత్రాలనే కాస్త అటు ఇటు మార్చేవారు ఎందరో ఉన్నారు. అందుకే మన వారు కొన్ని సార్లు కథ కొత్తగా ఉండకపోయిన కథనం ఆకట్టుకుంటుందని ముందుగానే చెబుతూ ఉంటారు. ఇక విషయానికి వస్తే తాజాగా సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మహేష్‌బాబు నటించగా గుణశేఖర్ దర్శకత్వంలో యం.యస్ రాజు నిర్మాతగా వచ్చిన 'ఒక్కడు', రవితేజ దర్శకత్వంలో అనిల్ రావిపూడి దర్శకునిగా దిల్‌రాజు నిర్మాణంలో వచ్చిన 'రాజా ది గ్రేట్' చిత్రాలు ఒకటేనని పలు ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చాడు. ఇది నిజమే కావచ్చు. కానీ ఆయన ఆ రెండు చిత్రాలనే ప్రత్యేకించి ఎందుకు ఉదాహరణలు గా తీసుకున్నాడో అర్ధం కావడం లేదు. 'బాహుబలి'లోని పాత్రలు, సంఘటనలన్నీ రామాయణం, భారతం వంటి వాటి నుంచే రాసినవి.
భజరంగీ భాయిజాన్ నుంచి అత్తారింటికి దారేదికి, అజ్ఞాతవాసి కూడా ఒకదానితో మరోటి సంబంధం, పసివాడి ప్రాణం దానికి మాతృక అయిన మలయాళం చిత్రమే కాపీ అని ఇక 'అ..ఆ' నుంచి వీటికిక ఎన్నో ఎన్నేన్నే ఉదాహరణలు ఉన్నాయి. అంతెందుకు.. పరుచూరి బ్రదర్స్ హవా గడిచిన దీర్ఘకాలంలో కూడా ఆయన చిత్రాలనే ఆయన అటు ఇటు మార్చి, బ్యాక్‌డ్రాప్‌ని మార్చి ఇచ్చిన కథలు అనేకం ఉన్నాయి. ఏదైనా వివరించేటప్పుడు ముందుగా తమ చిత్రాలను తాము ఉదాహరణగా తీసుకోవడం మంచిదేమో పరుచూరి గారు ఆలోచిస్తే బాగుంటుంది..!