వరుసగా ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేసే రవితేజ, నానిలకు కూడా డేట్స్‌కి వీలుంటుంది. నాని అలాగే ఒక వైపు వరుస చిత్రాలు చేస్తూనే బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికీ రజనీకాంత్ నుంచి కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్ వరకు వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇక కమెడియన్లయిన బ్రహ్మానందం, సునీల్ వంటి వారు నాడే ఏడాదికి పాతికపైగా చిత్రాలలో నటించేవారు. నేడు కూడా ఎందరో హీరోయిన్లు వరుస బెట్టి చిత్రాలు ఒప్పుకుంటూనే ఉన్నారు. కానీ అవకాశాలు రాని వారు, ఏదైనా చిత్రం నుంచి తీసి వేయడం వంటివి జరిగితే మాత్రం తామే తప్పుకున్నామని, తమకి డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని కుంటిసాకులు చెబుతూ ఉంటారు. అయితే వారు బిజీ వల్ల తప్పుకున్నారా?డేట్స్ అడ్జస్ట్ కాక బిజీగా ఉండి తప్పుకున్నారా? అని గ్రహించలేనంత అమాయకులుగా నేటి ప్రేక్షకులు లేరు.
ఇక విషయానికి వస్తే తన కెరీర్‌లో ఒకే ఒక్క శ్రీరస్తు..శుభమస్తు తప్ప మరో యావరేజ్ చిత్రంలేని బడా ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ చిన్నతనయుడు అల్లుశిరీష్. ఆ మధ్యన తన తండ్రి రికమండేషన్‌తో మోహన్‌లాల్ మలయాళ చిత్రంలో ఓ చాన్స్ సంపాదించాడు. ఇక ఇటీవల ఈయన కోలీవుడ్ మూవీగా తెరకెక్కనున్న ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఉపాడు. కేవీఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, బొమ్మన్ ఇరాని.. అల్లు శిరీష్‌లతో రూపొందుతున్న చిత్రం నుంచి అల్లు శిరీష్ అకస్మాత్తుగా తప్పుకున్నాడు.
దీనిపై మీడియాలో వరుసగా వార్తలు వస్తూ రావడంతో ఆయన తాజాగా మాట్లాడుతూ, ప్రస్తుతం నేను 'ఎబిసిడి' చిత్రంతో బిజీగా ఉన్నాను. అందుకే ఆ చిత్రానికి డేట్స్ అడ్జస్ట్ కాక తప్పుకున్నాను. నా పరిస్థితిని నిర్మాతలు, దర్శకులు కూడా అర్ధం చేసుకున్నారు. మరోసారి సూర్య చిత్రంలో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.