Advertisementt

'మై డియ‌ర్ మార్తాండం' టీజ‌ర్ తో వచ్చాడు..!

Sun 22nd Jul 2018 07:26 PM
comedian prudhvi,my dear marthandam,teaser,release,y s jagan  'మై డియ‌ర్ మార్తాండం' టీజ‌ర్ తో వచ్చాడు..!
My Dear Marthandam Movie Teaser Released 'మై డియ‌ర్ మార్తాండం' టీజ‌ర్ తో వచ్చాడు..!
Advertisement
Ads by CJ

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇక్క‌డ‌.. అంటూ త‌న‌దైన కామెడీ మేన‌రిజ‌మ్‌, టైమింగ్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న స్టార్ క‌మెడియ‌న్ పృథ్వీ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం 'మై డియ‌ర్ మార్తాండం'. మేజిన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ‌రీష్‌ కె.వి. ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు.  ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. రాకేందు మౌళి, క‌ల్యాణ్ విఠ‌పు, క‌ల్పిక గ‌ణేశ్ కీల‌క పాత్ర‌ధారులు. 

క‌ల్పిక మాట్లాడుతూ... ''18 రోజుల్లో షూటింగ్ పూర్త‌య్యింది. డైరెక్ష‌న్ టీం వ‌ల్ల‌నే అది సాధ్య‌మైంది. పృథ్వీగారు ఇందులో మా అంకుల్ పాత్ర‌లో క‌న‌ప‌డ్డారు. క్రైమ్ కామెడీ అయిన సినిమా చూసి వ‌చ్చేట‌ప్పుడు సంతోషంగా బ‌య‌ట‌కు వ‌స్తారు. రాకేందు మౌళి ప‌క్క‌న న‌టించ‌డం హ్యాపీగా ఉంది'' అన్నారు. 

పృథ్వీ మాట్లాడుతూ... ''ఈ సంస్థ‌లో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ప‌క్కా స్క్రిప్ట్‌తో సినిమాను సెట్స్‌కి తీసుకెళ్లారు. ఒక్క డైలాగ్ కూడా చేంజ్ లేకుండా సినిమా చేశాం. మంచి పాత్ర చేయ‌డ‌మే కాదు.. మంచి పారితోష‌కం కూడా అందుకున్నాను. లాయ‌ర్ పాత్ర‌లో న‌టించాను. అమాయ‌కుడిగా ఉండే తెలివైన వాడి పాత్ర నాది. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, తాగుబోతు ర‌మేశ్‌, కృష్ణ‌భ‌గ‌వాన్ త‌దిత‌రుల‌తో న‌టించ‌డం ఆనందంగా ఉంది. వై.ఎస్‌.జ‌గ‌న్ టీజ‌ర్ రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది'' అన్నారు. 

రాకేందు మౌళి మాట్లాడుతూ... ''గౌత‌మ్ మీన‌న్ గారితో చేసిన‌ 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'లో చాలా మంచి పాత్ర చేశాను. కిరాక్ పార్టీ నాకు మంచి పేరుతెచ్చిన మ‌రో సినిమా. ఇది తెలుగులో నాకు మంచి పేరు తెచ్చే మ‌రో సినిమా అవుతుంది. డైరెక్ట‌ర్ హ‌రీశ్ అన్న‌కు రుణ‌ప‌డి ఉంటాను. చిన్న బ‌డ్జెట్‌తో తీసినా.. విజువ‌ల్స్ గ్రాండ్‌గా ఉంటాయి. ఈ సినిమాల‌కు పాట‌లు కూడా రాశాను. నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా'' అన్నారు. 

క‌ల్యాణ్ విఠ‌పు మాట్లాడుతూ... ''ఇద్ద‌రు  పిల్ల‌లు స‌మ‌స్య‌ల్లో ప‌డి.. కాపాడ‌మ‌ని పృథ్వీగారి వ‌ద్ద‌కు చేరుకుంటారు. ఆయ‌న ఎలాంటివాడో వీళ్ల‌కు తెలియ‌దు. ఆయ‌నెలా కాపాడాడ‌నేదే సినిమా. ఇటీవ‌ల వై.ఎస్‌.జ‌గ‌న్‌గారు టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఆయ‌న‌కు థాంక్స్‌. నటీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌'' అన్నారు.

డైరెక్ట‌ర్ హ‌రీశ్ కె.వి మాట్లాడుతూ... ''మాది కోర్టు రూం క్రైమ్ కామెడీ. అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశామంటే అంద‌రి స‌హ‌కార‌మే కార‌ణం. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు'' అన్నారు. 

పృథ్వీ, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, కృష్ణ భ‌గ‌వాన్‌, రాకేందు మౌళి, గోకుల్‌, క‌ల్పిక గ‌ణేశ్‌, క‌ల్యాణ్ విఠ‌పు, తాగుబోతు ర‌మేశ్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ప‌్ర‌వీణ్‌, మ్యూజిక్‌: ప‌వ‌న్‌, ఎడిటింగ్‌: గ‌్యారీ బి.హెచ్‌, సినిమాటోగ్ర‌ఫీ:ర‌్యాండీ, నిర్మాత‌: స‌య్య‌ద్ నిజాముద్దీన్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: హ‌రీష్‌ కె.వి 

My Dear Marthandam Movie Teaser Released :

My Dear Marthandam Movie Teaser Released by Y S Jagan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ