ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి మొదటి నుంచి తమిళంతో పాటు తెలుగులో కూడా క్రేజ్ ఉన్నప్పటికీ ఆయనకు తెలుగులో 'పెదరాయుడు, భాషా' చిత్రాల తర్వాత ఎనలేని ఇమేజ్ వచ్చింది. నాటి నుంచి తెలుగు ప్రేక్షకులు కూడా రజనీ మాయలో పడిపోయారు. సురేష్‌కృష్ణ దర్శకత్వంలోవచ్చిన 'భాషా' చిత్రం నాడు ట్రెండ్ సెట్టర్. ఫస్టాఫ్‌లో హీరో సామాన్యుడిలా కనిపిస్తూ ఉండటం, ఆయన ఫ్లాష్‌బ్యాక్‌లో అందరి ఒణికించిన వాడు కావడం అనేది ఆ ఫార్ములా.
ఆ తర్వాత తెలుగులో బాలకృష్ణ నటించిన 'సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చిరంజవి ఇంద్ర, జూనియర్ ఎన్టీఆర్ ఆది, సాంబ, సింహాద్రి' వంటి చిత్రాలన్నీ దీని స్ఫూర్తితోనే వచ్చాయి. ఇక రజనీ 'భాషా' తర్వాత మరలా ఇటీవల వరుసగా 'కబాలి, కాలా' చిత్రాలలో కూడా డాన్‌గా నటించాడు. ఈ చిత్రాల జయాపజయాలను పక్కనపెడితే రజనీకాంత్ మాఫియాడాన్‌గా తన లుక్స్, గెటప్స్‌తో అందరినీ కేక పుట్టించాడు. కాగా ప్రస్తుతం రజనీ సన్‌పిక్చర్స్ సంస్థలో కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కూడా వరుసగా మూడో సారి రజనీ డాన్‌గానే కనిపించనున్నాడని సమాచారం.
అయితే ఫ్లాష్‌బ్యాక్‌లో డాన్‌గా కాకుండా, పగలంతా సామాన్యంగా ఉండే వ్యక్తిగా, రాత్రికి మాత్రం డాన్‌గా మారిపోయే పాత్ర ఆయనది అని సమాచారం. అంటే గతంలో వచ్చిన శంకర్ 'జెంటిల్‌మేన్, శివాజీ, అపరిచితుడు' వంటి ఛాయలతో ఈ చిత్రం సాగనుందట. మరి ఈ సారైనా రజనీ కేవలం గెటప్, స్టైల్‌తో మాయచేయడమే కాదు.. కంటెంట్‌తో కూడా తన సత్తా చాటాలని ఆశిద్దాం. ఇక ఈ చిత్రంలో రజనీ సరసన సిమ్రాన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.