Advertisementt

ఈ సినిమాని నడిపించేది ప్రకాష్ రాజే..!

Sat 21st Jul 2018 08:26 PM
prakash raj,saakshyam,voice over,sreewas,bellamkonda srinivas  ఈ సినిమాని నడిపించేది ప్రకాష్ రాజే..!
Prakash Raj Voice Over to Saakshyam Movie ఈ సినిమాని నడిపించేది ప్రకాష్ రాజే..!
Advertisement
Ads by CJ

సాక్ష్యం చిత్రానికి ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ !!

బెల్లంకొండ సాయిశ్రీనివాస్-పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాక్ష్యం' చిత్రం జూలై 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండగా.. ఈ చిత్రానికి ప్రఖ్యాత నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కథాగమనానికి వాయిస్ ఓవర్ అనేది చాలా కీలకం, అందులోనూ 'సాక్ష్యం' లాంటి చిత్రానికి స్క్రీన్ ప్లే చాలా కీలకం. ఈ చిత్రానికి ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ వాయిస్ ఓవర్ చెబితే బాగుంటుందని భావించిన శ్రీవాస్ స్వయంగా ప్రకాష్ రాజ్ ను సంప్రదించగా ఆయన సమ్మతించారు. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ సినిమాలో చాలా కీలకపాత్ర పోషించనుంది. 

ఖర్మ సిద్ధాంతం నేపధ్యంలో తెరకెక్కిన 'సాక్ష్యం' చిత్రం ప్రేక్షకులకి ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. అభిషేక్ నామా నిర్మాణంలో రూపొందుతున్న 'సాక్ష్యం' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా త్వరలో పూర్తికానున్నాయి. 

Prakash Raj Voice Over to Saakshyam Movie:

Prakash Raj lends his voice for 'Saakshyam'

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ