బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా. కాగా ఈమె నిక్ జోనాన్‌తో డేటింగ్‌లో ఉందని, వీరి మధ్య ఎఫైర్ కూడా ఉందని బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ మీడియా కూడా కోడైకూస్తోంది. కానీ ఈమె మాత్రం మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెబుతూ చేతిలో చెయ్యేసుకుని పార్టీలకు, పబ్బులకు వెళ్లుతూ హడావుడి చేస్తోంది. దీంతో వీరిద్దరు త్వరలో ఒకటి కానున్నారనే ప్రచారం బాగా ఎక్కువైంది.
అయితే గతంలో ప్రియాంకా తల్లి మధు చోప్రా మాత్రం ఓ విదేశీయుడిని అల్లుడిగా ఎప్పటికీ ఒప్పుకోనని వ్యాఖ్యానించింది. మరోపక్క నిక్‌ని తన తల్లికి పరిచయం చేయడం కోసం అతడిని ఇండియా తీసుకుని వచ్చి మరీ ప్రియాంకా తన తల్లికి పరిచయం చేసింది. ఆ సందర్భంగా ఈమె తల్లిని ప్రశ్నిస్తే ఇప్పుడే కదా పరిచయం అయింది... అప్పుడే ఎలా చెప్తాను అంటూ సమాధానం ఇచ్చింది. మరోవైపు నిక్ కూడా ప్రియాంకాను తన తల్లిదండ్రులకు పరిచయం చేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్‌టాపిక్‌గా మారింది.
తాజాగా తన కూతురు ప్రియాంకా వివాహంపై ఆమె తల్లి మధు మాట్లాడుతూ, 'పెళ్లి విషయాన్ని మీరు సీరియస్‌గా తీసుకుంటున్నారా? అలా అయితే మాకు చెప్పండి. మేము సీరియస్ గానే ఆలోచిస్తాం' అంటూ ప్రశ్నకు సూటిగా జవాబివ్వకుండా దాట వేత ధోరణిలో సమాధానం ఇచ్చింది. ఆమె మాటలలోని మర్మం అర్దంకాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రియాంకా, నిక్‌తో కలిసి విహారయాత్ర నిమిత్తం లండన్ వెళ్లింది. బుధవారం ప్రియాంకా పుట్టిన రోజును జరుపుకుంది. త్వరలో వీరిద్దరు గ్రీస్ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.