మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ఇద్దరి సినిమాలు ఇటీవలే రిలీజ్ అయ్యాయి. ముందుగా సాయి ధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'తేజ్ ఐ లవ్ యు' చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి చిరంజీవినే రంగంలోకి దిగినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయింది. ఆడియో ఈవెంట్ కు వచ్చిమరీ సపోర్ట్ చేసిన బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. వరస ప్లాప్స్ తో సతమతం అవుతున్న టైములో తేజ్ కు ఈ చిత్రంతో ఇంకో పరాజయం తప్పలేదు.
ఇక చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ‘విజేత’ సినిమా కూడా ఇంచుమించు అదే పరిస్థితి. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. దీనికి కూడా చిరంజీవి సపోర్ట్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ 'విజేత' చిత్రం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది.
ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేసిన సినిమాలు కూడా ఆడట్లేదంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అంటే దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుందంటే.. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాలని ఆదరిస్తారు.. లేకపోతే లేదు అని అర్ధం అవుతుంది. అది మ్యాటర్.