Advertisementt

టాలీవుడ్ ని బాగా క్యాష్ చేసుకుంటోంది..!!

Sat 21st Jul 2018 09:26 AM
pooja hegde,top heroine,tollywood,remuneration,heroine,1 crore  టాలీవుడ్ ని బాగా క్యాష్ చేసుకుంటోంది..!!
Pooja Hegde Busy with Movies in Tollywood టాలీవుడ్ ని బాగా క్యాష్ చేసుకుంటోంది..!!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ 'డీజే' చిత్రంతో ఊహించని ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే...అంతకుముందు వరుణ్ తేజ్ మొదటి సినిమా 'ముకుంద‌'.. నాగ చైతన్య 'ఒక లైలా కోసం' సినిమాల్లో హీరోయిన్ గా నటించినా, వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోయినా.. 'డీజే'తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ లో హృతిక్ స‌ర‌స‌న న‌టించిన 'మొహంజోదారో'తో తేలేని కొత్త ఇమేజ్‌ని 'డీజే' తెచ్చింది ఈ ముంబై బొమ్మ‌కు.

అందుకే ఆమె టాలీవుడ్ లో సెటిల్ అయ్యి తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తుంది. లేటెస్ట్ గా ఈమె బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న 'సాక్ష్యం' సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతోంది. అయితే ఈమె ఆ సినిమా కోసం కోటి రెమ్యున‌రేష‌న్ తీసుకుందంట. ఆమె అడిగినంత నిర్మాతలు ఇచ్చారని టాక్.

ఇకపోతే ఈమె ఎన్టీఆర్ సరసన 'అర‌వింద స‌మేత‌'తో పాటు.. మహేష్ 25వ సినిమాలో.. అలాగే  రాధా కృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోయే సినిమాలో కూడా పూజాని సెలెక్ట్ చేశారంట. ఇలా పెద్ద సినిమాల్లో నటిస్తూనే యంగ్ హీరోస్ స‌ర‌స‌న అవ‌కాశాల్ని ప‌రిశీలిస్తోందట‌. త‌న వ‌ర‌కూ భారీ పారితోషికం ముడితే పూజా న‌టించేందుకు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌డం లేద‌ని తెలుస్తోంది. పెద్ద హీరోల సినిమాలు అంటే ఎలాగో భారీగానే ముడుతోంది కాబట్టి యువ‌హీరోల సినిమాల్లో కూడా అంతే తీసుకోవాలని అనుకుంటుందట. అయితే వాళ్లతో సినిమా చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయ‌ని చెప్పుకుంటున్నారు. మొత్తానికి పూజా టాలీవుడ్ ని బాగానే వాడుకుంటుంది.

Pooja Hegde Busy with Movies in Tollywood:

Pooja Hegde Takes 1 Crore for Saakshyam Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ