Advertisementt

పవన్ కళ్యాణ్ ఫస్ట్ హీరోయిన్ రీఎంట్రీ లుక్!

Fri 20th Jul 2018 04:41 PM
supriya yarlagadda,goodachari,pawan kalyan first heroine,re entry  పవన్ కళ్యాణ్ ఫస్ట్ హీరోయిన్ రీఎంట్రీ లుక్!
Supriya Yarlagadda returns with 'Goodachari' పవన్ కళ్యాణ్ ఫస్ట్ హీరోయిన్ రీఎంట్రీ లుక్!
Advertisement
Ads by CJ

'గూఢచారి'తో సుప్రియా యార్లగడ్డ రీఎంట్రీ

దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సుప్రియా యార్లగడ్డ మళ్ళీ వెండితెరకు 'గూఢచారి'తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సుప్రియా యార్లగడ్డ పోషిస్తున్న నదియా ఖురేషీ పాత్ర లుక్ ను ఇవాళ విడుదల చేశారు. రా ఏజెన్సీకి కి చెందిన త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేసే సీక్రెట్ ఏజెంట్ గా మిస్టీరియస్ ఏజెంట్ గా కనిపించే ఈమె రా ఏజెన్సీలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ చీఫ్ టాస్క్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఈమె 92 FS తుపాకీని క్యారీ చేస్తుంది. 

'గూఢచారి' చిత్రంలో సుప్రియా యార్లగడ్డ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు సినిమాకి కీలకం కానుంది. ఇటీవల విడుదలైన 'గూఢచారి' టీజర్ కి విశేషమైన స్పందన లభించింది. యూట్యూబ్ లో ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. 116 రోజులపాటు 168 లొకేషన్స్ లో షూట్ చేయబడ్డ ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. శశికిరన్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. 

Supriya Yarlagadda returns with 'Goodachari':

The first look of actress Surpriya Yarlagadda from the movie ‘Goodachari’ is unveiled. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ