ప్రస్తుతం బాలకృష్ణ నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా, దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని భారీ కాదు గాని 50 నుండి 70 కోట్ల బడ్జెట్ తో బాలకృష్ణ తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమా ప్రస్తుతం ఎన్టీఆర్ నటజీవితం గురించిన సన్నివేశాలను దర్శకుడు క్రిష్ రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. ఆమెకి భారీ పారితోషకం ఇచ్చి మరీ విద్యని ఈ బసవతారకం పాత్రకి క్రిష్ ఒప్పించి తీసుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో ఎలాంటి విషయాలు చూపెడతారో క్లారిటీ లేదుగాని.. నట జీవితాన్ని హైలెట్ చేస్తూ పొలిటికల్ లైఫ్ ని లైట్ గా చూపెడతారనే టాక్ ఉంది. అందుకే ప్రస్తుతం ఎన్టీఆర్ నట జీవితంపై సినిమాలోని పలు కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు. నందమూరి తారక రామారావు సినిమాల్లో వేసిన పలు గెటప్స్ అంటే దాదాపుగా 66 గెటప్స్ ని బాలయ్య ఈ సినిమాలో వెయ్యబోతున్నాడనే విషయం తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రధారి విద్యాబాలన్, అలాగే ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ మీద సన్నివేశాలు తెరకెక్కుతుంటే.. నట జీవితంలో ఎన్టీఆర్ కి సన్నిహితులైన సావిత్రి, శ్రీదేవి, ఏఎన్నార్, కృష్ణ పాత్రల ఎంపిక మొదలు పెట్టాడు క్రిష్. ఇప్పటికే సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ని, శ్రీదేవి పాత్రకి రకుల్ ప్రీత్ ని, ఏఎన్నార్ పాత్రకు అక్కినేని మనవడు సుమంత్ ని ఎంపిక చేసింది ఎన్టీఆర్ మూవీ యూనిట్. ఇదంతా ఓకే గాని బసవతారకం చనిపోయాక ఎన్టీఆర్ చానళ్లకు మరో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి పార్వతి అనే ఆవిడని ఎన్టీఆర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆతర్వాతే అయన తన కన్నపిల్లలకి దూరమయ్యాడనే విషయం విదితమే. మరి ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ సెకండ్ మ్యారేజ్ ని చూపెడతారా.. చూపెడితే లక్ష్మి పార్వతి పాత్రధారి ఎవరు అనే ఆసక్తి జనాల్లో మెదులుతుంది. అలాగే సెకండ్ మ్యారేజ్ తర్వాత కన్నబిడ్డలే ఎన్టీఆర్ ని దూరం పెట్టిన సంగతి ఎన్టీఆర్ బయోపిక్ లో స్థానం ఉందా. అలాగే రాజకీయాల్లో ఎన్టీఆర్ ఎదుర్కొన్న ఒడిడుకులు... చంద్రబాబు వెన్నుపోటు లాంటివి ఈ బయోపిక్ లో స్థానముండదనే విషయం కూడా పెద్ద డౌట్. అలాగే ఎన్టీఆర్ హార్ట్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు అన్ని వాస్తవాలుగా ఈ బయోపిక్ లో చూపెడతారో లేదో తెలియదు కానీ.. లక్ష్మి పార్వతి పాత్రకి ఎవరిని ఎంపిక చేస్తారా అనేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్.