తెలుగులో సూపర్ సక్సెస్ లు వస్తున్న తరుణంలో బాలీవుడ్ కి వెళ్ళడం వేరు, కానీ.. ఇక్కడ ఆఫర్లు అందిపుచ్చుకోవడానికే ఇబ్బంది పడుతున్న తరుణంలో బాలీవుడ్ కి వెళ్ళడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇప్పుడు ఆ ఇబ్బందినే ఎదుర్కొంటోంది లావణ్య త్రిపాఠి. తెలుగులో దారుణమైన పరాజయాలు చవిచూశాక కొంచెం గ్యాప్ అనంతరం చాలా కష్టపడి రెండు సినిమా ఆఫర్లు దక్కించుకొంది. నిఖిల్ సరసన 'ముద్ర' అనే సినిమాతోపాటు వరుణ్ తేజ్ సరసన 'అంతరిక్షం'లోనూ నటిస్తోన్న లావణ్య త్రిపాఠి.. ఈ రెండు సినిమాల అనంతరం మరో సినిమా సైన్ చేయలేదు.
ఇదివరకు తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ వచ్చిన లావణ్య ఈమధ్యకాలంలో కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. తెలుగులో అంటే అమ్మడికి సరైన ఆఫర్లు రాలేదు కాబట్టి ఒకే.. కానీ తమిళంలో ఆఫర్లు వస్తున్నా ఎందుకు సైన్ చేయడం లేదా అని ఆరా తీయగా.. అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు సైన్ చేయనుందట అందుకే.. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు సైన్ చేయకుండా బాలీవుడ్ కథలు వింటోందట.
అసలే కథానాయికగా కనీస స్థాయి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇబ్బందిపడుతున్న తరుణంలో లావణ్య త్రిపాఠికి ఇప్పుడు ఈ బాలీవుడ్ ప్రయాణం అవసరమా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిజమే మరి తెలుగులో ఫ్లాపుల తర్వాత బాలీవుడ్ కి జంప్ అయితే.. ఏదో ఆఫర్లు రావట్లేదు కాబట్టి అక్కడికి వెళ్లిపోయింది అనుకొంటారు తప్ప అమ్మడిని ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి అని ఎవరనుకొంటారు.