Advertisementt

ఈయన నిజంగానే పవన్ కి కోవర్టా..?

Fri 20th Jul 2018 11:10 AM
  ఈయన నిజంగానే పవన్ కి కోవర్టా..?
Ganta Srinivasa Rao criticize Pawan Kalyan ఈయన నిజంగానే పవన్ కి కోవర్టా..?
Advertisement
Ads by CJ

నేడు మంచి నాయకులు, చెడ్డ నాయకులంటూ ఎవ్వరూ లేరు. అందరూ అవకాశ వాదులు, మాటలు చెప్పి.. చెప్పిన మాటలను తప్పి హామీలను గట్టునపెట్టేవారే. దీనికి పవన్‌, చంద్రబాబు, జగన్‌ ఎవ్వరూ అతీతం కాదనేది సర్వత్రా అంగీకరించే విషయమే. ఇక పవన్‌ విషయానికి వస్తే ఆయన ప్రత్యేకహోదా కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తానన్నాడు. ఎవరైనా కేంద్రంలో అవిశ్వాస తీర్మానం పెడితే దేశమంతా తిరిగి అన్ని పార్టీల ఎంపీల మద్దతు కూడగడతానన్నాడు. అనంతపురం నుంచి తన యాత్ర మొదలవుతుందని చెప్పి మరలా ఉత్తరాంధ్రకి వెళ్లాడు. మరోవైపు జనసేన మొత్తాన్ని వన్‌మ్యాన్‌షోగా మారుస్తూ, మెగాభిమానులు, తన సామాజికవర్గంలోని కొందరిని వేసుకుని ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్నాడు. మధ్యలో రంజాన్‌ అని, అనారోగ్యం అని, తాజాగా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా వుంటారు కాబట్టి పర్యటనకు కాస్త విరామం ఇస్తానని ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. 

మరోవైపు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్‌ అందరికి తెలిసిందే. ఏ పార్టీలో అవకాశం, విలువ ఉంటాయో ఆ పార్టీలోకి జంప్‌ చేసే వ్యక్తిగా, జంప్‌జిలాని, గోడమీద పిల్లి వంటి గంటా శ్రీనివాసరావు అటు మంత్రిగా, ఇటు ఎమ్మెల్యేగా కూడా బలహీనపడుతున్నాడు. ఓ సర్వేలో ఆయనకు తన నియోజకవర్గంలోనే వ్యతిరేతక బాగా ఉందని, ఈసారి పోటీ చేస్తే ఓడిపోతాడని తేలితే, దానిని తనపై కక్ష్యతో చేసిన సర్వేగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈయనకు ప్రజారాజ్యం నాటి చిరుతో, నేడు పవన్‌ జనసేనతో కూడా లోపాయి కారీ ఒప్పందం ఉందని, ఆయన పవన్‌ జనసేనకు కోవర్టుగా పనిచేస్తూ, ఏయే నియోజకవర్గాలలో జనసేనకి ఏయే నాయకులు అవసరమో పవన్‌కి సీక్రెట్‌గా చెబుతూ, జనసేనకు కోవర్ట్‌గా పనిచేస్తున్నాడని కూడా కొందరి అనుమానం. 

ఇక పవన్‌పై విమర్శల విషయంలో టీడీపీలో ఉన్నాడు కాబట్టి.. అందునా ఇప్పుడు టీడీపీకి, జనసేనకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది కాబట్టి పవన్‌పై ఈయన నామమాత్రపు విమర్శలు చేస్తున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విషయానికి వస్తే తాజాగా గంటా శ్రీనివాసరావు పవన్‌పై విమర్శలు చేశారు. పవన్‌ మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నాడు. ఆయన తీరు చూసి జనం నవ్వుకుంటున్నారు. ప్రజల కోసం అన్ని వదులుకుని వచ్చానని పవన్‌ చెబుతున్న మాటల ఉత్తుత్తివే. రైల్వే జోన్‌ కోసం టిడిపి విశాఖలో దీక్ష చేస్తున్న సమయంలో ఉత్తరాంధ్రలోనే ఉన్న పవన్‌ ఎందుకు మద్దతు ఇవ్వలేదు. జగన్‌, పవన్‌లకు మోదీ అంటే విపరీతమైన భయం.. అంటూ పైకి తీవ్ర వ్యాఖ్యలు చేసినా వాటికి సరైన విశ్వసనీయత లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Ganta Srinivasa Rao criticize Pawan Kalyan:

Ganta Srinivas Rao Shocking Comments on Pavan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ