Advertisementt

టీజరే చెప్తుంది మరో వైవిధ్య చిత్రమని..!

Thu 19th Jul 2018 01:53 PM
subhalekha plus lu,swathi varma,swathi prasad,teaser,different film  టీజరే చెప్తుంది మరో వైవిధ్య చిత్రమని..!
Subhalekha Plus Lu Teaser Released టీజరే చెప్తుంది మరో వైవిధ్య చిత్రమని..!
Advertisement
Ads by CJ

ఈమద్య 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, ఈ నగరానికి ఏమైంది, ఆర్‌ఎక్స్‌ 100, ఫిదా, తొలిప్రేమ, ఛలో' వంటి విభిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బాగా మెప్పిస్తున్నాయి. డిఫరెంట్‌ టేకింగ్‌, స్క్రీన్‌ప్లేలో వైవిధ్యం వంటివి వీటికి అండగా నిలుస్తున్నాయి. ఇదే కోవలో ప్రస్తుతం మరో వైవిధ్యభరిత చిత్రం రూపొందుతోంది. ఈచిత్రం టైటిల్‌ 'శుభలేఖ ప్లస్‌ లు'. నాడు చిరంజీవి హీరోగా వచ్చిన 'శుభలేఖ' టైటిల్‌కి 'లు' అనే బహువచనాన్ని జోడించిన ఈ చిత్రం టైటిల్‌ కూడా బాగా వైవిధ్యంగానే ఉంది. సాయి శ్రీనివాస్‌, ప్రియ వడ్లమాని, దీక్షాశర్మలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన టీజర్‌ ఎంతో వైవిధ్యంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్ర యూనిట్‌ తాజాగా మరో టీజర్‌ని విడుదల చేసింది. పెళ్లి గురించి నేటి సమాజంలో మరీ ముఖ్యంగా మోడ్రన్‌ యువతలో మరీ ముఖ్యంగా మోడ్రన్‌ అమ్మాయిలలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? అనే వైవిధ్యమైన కాన్సెప్ట్‌ చుట్టు ఈ చిత్రం సాగనుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రానికి రాధాకృష్ణన్‌ సంగీతం అందించనున్నాడు. ఈయన సంగీతం కూడా సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని యూనిట్‌ ఎంతో నమ్మకంతో ఉంది. 

Click Here For Teaser 

Subhalekha Plus Lu Teaser Released:

Teaser Quotes Subhalekha Plus Lu is a Different Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ