Advertisementt

చరణ్ సినిమాకి స్వాతంత్ర్యం వస్తోంది..!

Thu 19th Jul 2018 12:53 PM
ram charan,boyapati srinu,first look,title,independence day  చరణ్ సినిమాకి స్వాతంత్ర్యం వస్తోంది..!
Ram Charan's Film First Look and Title on August 15 చరణ్ సినిమాకి స్వాతంత్ర్యం వస్తోంది..!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ రంగస్థలం సినిమా తర్వాత మాస్ ఎంటర్టైనర్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. మాస్ దర్శకుడిగా పేరున్న బోయపాటి, రామ్ చరణ్ ని ఫుల్ అండ్ ఫుల్ మాస్ హీరోగా ఎలివేట్ చెయ్యకుండా.. కుటుంబానికి, ప్రేమకు, యాక్షన్ కి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా కథను తయారు చేసుకున్నది అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబందించిన లుక్స్ గాని, టైటిల్ గాని మరే ఇతర విషయాలు గాని బయటికి రాలేదు. హైదరాబాద్ తో పాటుగా విదేశాల్లోనూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుండి రెగ్యులర్ షూటింగ్ కి చాలా టైం తీసుకున్న వీరు రెగ్యులర్ షూటింగ్ లో కూడా మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా షూటింగ్ కి బ్రేక్ లేకుండా జరుపుతున్నారు.

అయితే ఈ సినిమాని 2019 సంక్రాంతి బరిలో దింపుతున్నారు గనుక ఈ సినిమా టైటిల్ గాని, ఈ సినిమా ఫస్ట్ లుక్ గాని ఇప్పట్లో వదలరని అన్నారు. ఎందుకంటే విడుదల సమయం చాలా దూరం ఉన్నందున అప్పుడే ఇలా టైటిల్ ని ఫస్ట్ లుక్ ని వదిలేస్తే సినిమా మీద ఆసక్తి తగ్గుతుందని భావిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్, టైటిల్ ని విడుదల చేసేందుకు బోయపాటితో పాటుగా రామ్ చరణ్ కూడా సిద్దమవుతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఎలాగూ రాజమౌళి సినిమా కోసం అక్టోబర్ కల్లా రామ్ చరణ్ ఫ్రీ అవ్వాలి కాబట్టి.. నవంబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసేసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దర్శకుడు బోయపాటి మీద పడేసి చరణ్, రాజమౌళి మల్టీస్టారర్ కోసం సిద్దమైపోతాడట. అయితే ఈలోపుగా సినిమా టైటిల్ కి ఫస్ట్ లుక్ కి ముహూర్తం సెట్ చేసినట్లుగా తెలుస్తుంది.

ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున కేవలం సినిమా రిలీజ్ ల సందడే కాదు.. చాలా సినిమాల ఫస్ట్ లుక్స్ తో పాటుగా ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు లుక్స్ కూడా విడుదల చేస్తారు దర్శక నిర్మాతలు. అందుకే ఈసారి ఆగష్టు 15 న రామ్ చరణ్ అండ్ బోయపాటి తమ చిత్ర ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ ని విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. ఇక ఈ న్యూస్ ఇలా వినబడిందో లేదో మెగా ఫ్యాన్స్ కి పూనకాలొచ్చేస్తున్నాయ్. ఎందుకంటే ప్రస్తుతం మెగా హీరోలందరిలో రామ్ చరణ్ ముందున్నాడు. అందుకే రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్టు మీద మెగా అభిమానులతో పాటుగా ట్రేడ్ లో భీభత్సమైన అంచనాలున్నాయి. మరి ఆగష్టు 15 న సినిమా ఫస్ట్ లుక్ వదిలితే ఈ చిత్రాన్ని 2019 సంక్రాతి కానుకగా... జనవరి 11 న విడుదల డేట్ లాక్ చేశారు దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుండగా... ఈ సినిమాని డి. వి. వి. దానయ్య నిర్మిస్తున్నాడు.

Ram Charan's Film First Look and Title on August 15:

Ram Charan and Boyapati Film Latest Update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ