నిన్నగాక మొన్న నాగార్జున నుండి నాగ చైతన్య - సమంత లు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను తీసుకోబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. నాగార్జున ప్రస్తుతం ఈ వయసులో సినిమాల్తో పాటుగా బిజినెస్ వ్యవహారాలను చూసుకోవడంతో.. అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను నాగ చైతన్య - సమంత లు టేకప్ చేయబోతున్నారని... అందులో భాగంగానే ప్రస్తుతం సుశాంత్ 'చి ల సౌ' సినిమా విడుదల బాధ్యతలను ఈ భార్యాభర్తలు నిర్వహిస్తున్నట్లుగా సోషల్, వెబ్, ప్రింట్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన అన్నపూర్ణ బ్యానర్ నుండి బయటికి రాలేదు. సో ఆ న్యూస్ చక్కర్లు కొడుతున్న టైం లోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
అదేమిటంటే టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా పేరున్న సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలను ప్రస్తుతం రామానాయుడు గారి తర్వాత ఆయన పెద్ద కొడుకు సురేష్ బాబు చూసుకుంటున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ హీరో కాగా సురేష్ బాబు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ లో అనేక భారీ, చిన్న సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. అయితే ఈ మధ్యన సురేష్ బాబుకి వ్యవసాయం పై మక్కువతో.. అటు సేంద్రియ పద్దతిలో ఎలాంటి మందులు వాడని పంటలు పండించడమే కాదు.. తన ఫామ్ హౌస్ లో గేదెలను, ఆవులను పెంపకం చేపట్టాడు. మేము వ్యవసాయ ఆధారిత కుటుంబంతోనే సినిమాల్లోకి అడుగు పెట్టామని.. అందుకే ఇప్పుడు వ్యవసాయాన్ని కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నట్లుగా సురేష్ బాబు చెప్పారు. అలాగే పలు వ్యాపారాల్లో సురేష్ బాబు తలమునకలై ఉన్నాడు.
ఇక తాజాగా సురేష్ ప్రొడక్షన్ బాధ్యతలు ఆయన పెద్ద కొడుకు హీరో రానా చేతుల్లోకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రానా విభిన్న చిత్రాలతో తనకు ఒక ఐడెంటిటీని సెట్ చేసుకున్నాడు. అటు హీరోగా, విలన్ గా రానా ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి టైం లో రానా తన తండ్రి ఆధ్వర్యంలో నడుస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి రెడీ అయ్యాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో జోరుగా స్ప్రెడ్ అయ్యింది. ప్రస్తుతం హెల్త్ ఇష్యుస్ మీద విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రానా అతి త్వరలోనే సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలను తీసుకోబోతున్నట్లుగా ప్రచారం మొదలైంది. ఇక ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ లో యంగ్ అండ్ డైనమిక్ అండ్ కొత్త డైరెక్టర్స్ ని టాలీవుడ్ కి అందిస్తూ చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే రానా హీరోగా భారీ బడ్జెట్ తో గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప సినిమాని నిర్మించబోతున్నారు.