Advertisementt

సావిత్రిగా ఈ భామ.. శ్రీదేవిగా ఆ భామ!!

Thu 19th Jul 2018 11:02 AM
keerthi suresh,rakul preet singh,krish,sridevi,savitri,ntr biopic  సావిత్రిగా ఈ భామ.. శ్రీదేవిగా ఆ భామ!!
Heroines Set for Savitri and Sridevi Roles in NTR సావిత్రిగా ఈ భామ.. శ్రీదేవిగా ఆ భామ!!
Advertisement
Ads by CJ

సాధారణంగా ఒకసారి పోషించగా అద్భుతమైన గుర్తింపు, ప్రశంసలు లభించిన పాత్రను మళ్ళీ వేరే భాషలో పోషించడానికి భయపడతారు మన హీరోహీరోయిన్లు. అలాంటిది ఏ పాత్రతో అయితే నటిగా విశేషమైన గుర్తింపు లభించిందో మళ్ళీ అదే పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతోంది బొద్దుగుమ్మ కీర్తిసురేష్. 'కీర్తి సురేష్ కి నటించడం వచ్చా?' అని అప్పటివరకూ ఆమెను ఎగతాళి చేసినవాళ్ళందరూ నోరు మూసుకొనేలా 'మహానటి'లో తన నట విశ్వరూపం చూపించిన కీర్తి సురేష్ మళ్ళీ అదే మహానటిగా కనిపించనుందని తెలుస్తోంది. 

'మహానటి' అనంతరం తెలుగులో రూపొందుతున్న మరో బయోపిక్ 'ఎన్టీయార్'. బాలయ్య స్వయంగా తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. ఎన్టీయార్ సినీ జీవితంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి సావిత్రి, ఆవిడ పాత్రలో కీర్తిసురేష్ ను తప్ప వేరెవర్నీ ఊహించుకోలేకపోతున్నాడట క్రిష్. అందుకే ఆమెను సంప్రదించగా క్రిష్ మీద ఉన్న గౌరవంతో సావిత్రిగా ఓ మూడు సన్నివేశాల్లో నటించడానికి ఒప్పుకొందట కీర్తి సురేష్. అలాగే.. ఈ చిత్రంలో శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని తెలుస్తోంది. ఈమేరకు అగ్రిమెంట్ లు తప్ప మిగతా ప్రొసీజర్ మొత్తం పూర్తయిందట. త్వరలోనే వాళ్ళిద్దరూ 'ఎన్టీఆర్' సెట్ లో ప్రత్యక్షమవ్వడం ఖాయం. 

ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడట క్రిష్.. అందుకే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నాడట. 

Heroines Set for Savitri and Sridevi Roles in NTR:

Keerthi Suresh as Savitri and Rakul Preet as Sridevi for NTR Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ