Advertisementt

చైతు-సామ్ సంసారంలో విభేదాలకు కారణం!!

Wed 18th Jul 2018 09:13 PM
naga chaitanya,samantha,siva nirvana,ninnu kori,misunderstanding  చైతు-సామ్ సంసారంలో విభేదాలకు కారణం!!
Lady fingering in Naga Chaitanya and Samantha's life చైతు-సామ్ సంసారంలో విభేదాలకు కారణం!!
Advertisement
Ads by CJ

సమంత - నాగ చైతన్యల జంట సినిమాల్లో ఉన్నప్పుడు హీరోహీరోయిన్స్ గా మూడు సినిమాల్లో నటించారు. అందులో రెండు సూపర్ హిట్స్. 'ఏ మాయ చేసావే, ఆటో నగర్ సూర్య, మనం' సినిమాల్లో ఈ జంట అందరిని అలరించింది. అయితే మనం సినిమా కన్నా ముందు ప్రేమలో పడిన వారిద్దరూ గత ఏడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుండి ఈ జంటకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. పెళ్ళికి ముందు వారిద్దరూ కలిసి నటిస్తే వచ్చే క్రేజ్ కన్నా పెళ్లి తర్వాత వారు నటించే సినిమా మీద భారీగా అంచనాలతో పాటుగా క్రేజ్ కూడా ఏర్పడింది. అయితే పెళ్లి చేసుకుని దాదాపు ఏడాది సమయం దగ్గరపడుతున్న తరుణంలో చైతు, సామ్ లు నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నారు.

శివ నిర్వాణ తన మొదటి సినిమాలో భార్య భర్తలైన ఆది పినిశెట్టి, నివేదల మధ్యకి నివేద థామస్ మొదట ప్రేమించిన నానిని తీసుకొస్తాడు. నాని వారి అన్యోన్యతను చూసి నివేద మీద ఉన్న ప్రేమను చంపుకునేలా సినిమాని తీర్చిదిద్ది శివ నిర్వాణ హిట్ కొట్టాడు. అయితే తన రెండో సినిమాని శివ అదేలాంటి కాన్సెప్ట్ తో చేయబోతున్నాడట. రియల్ భార్యాభర్తలైన నాగ చైతన్య - సమంత జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా చైతు, సామ్ లు భార్యభర్తలుగానే నటిస్తున్నారట. ఈ విషయం నాగ చైతన్యనే స్వయంగా చెప్పాడు. తామిద్దరం అంటే సామ్, నేను శివ నిర్వాణ సినిమాలో భార్య భర్తలుగా చేయబోతున్నామని చెప్పాడు.

అయితే నిన్నుకోరి సినిమాలో వలె ఈ సినిమాలోనూ ఒక ట్విస్ట్ ఉందట. అదేమిటంటే... నాగ చైతన్య.. సమంతని పెళ్లాడిన తర్వాత అతని లైఫ్ లోకి మరో అమ్మాయి ప్రవేశించడంతో... చైతు - సామ్ సంసారంలో విభేదాలు తలెత్తడం.... వారి సంసారంలో వచ్చిన ఇబ్బందులను తొలిగించుకోవడానికి వారు తీసుకునే నిర్ణయాలతో.. మళ్ళీ ఒక్కడవడం వంటి విషయాలతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఈ సినిమా ఉండబోతుందట. మరి నిజమైన భార్య భర్తలు ఇలా సినిమాలో కలిసి భార్య భర్తలుగా నటిస్తే ఆ సినిమా కొచ్చే క్రేజ్ మాటల్లో వర్ణించలేనిది. మరి చైతు - సామ్ ల సినిమా శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చే నెలలో సెట్స్ మీదకెళ్లనున్నట్టుగా తెలుస్తుంది.

Lady fingering in Naga Chaitanya and Samantha's life:

Naga Chaitanya and Samantha Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ