నేటి హీరోలలో తనకంటూ సెపరేట్ స్టైల్, ముక్కుసూటి తనం, విభిన్న చిత్రాలను చేయాలనే తపన ఉన్న హీరోలలో సిద్దార్ద్ ఒకరు. ఇక విషయానికి వస్తే నేటిరోజుల్లో హీరోల అభిమానులు తమ హీరోల బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని మహా అయితే ఒక రోజు ముందు.. అదీ కాకుంటే వారం ముందు ప్రారంభిస్తారు. కానీ సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఓ హీరో బర్త్‌డేకి 100 రోజుల ముందు నుంచే 100డేస్ టుగో అంటూ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నారు. దీనివల్ల అసలు పుట్టినరోజు నాటికి పెద్దగా ఆసక్తి లేకుండా పోతోంది. దీనినే సిద్దార్ద్ ఎత్తి చూపాడు.
ఫిలిం ఎనలిస్ట్ రమేష్‌బాలా అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా 100డేస్ టు గో కింగ్ ప్రభాస్ బర్త్‌డే అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దాంతో సిద్దార్ద్ ఆరోజు తర్వాత మరో 365రోజుల ఆగితే మరో బర్త్‌డే వస్తుందని కాస్త వ్యంగ్యం, హాస్యం కలగలిపి ట్వీట్ చేశాడు. దాంతో ప్రభాస్ అభిమానులు మా హీరో గురించి ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతావా? అంటూ మండిపడుతున్నారు. నీవు రజనీ, అజిత్, విజయ్ వంటి హీరోల గురించి కూడా ఇలాగే వ్యంగ్యాస్త్రాలు విసురుతావా? అసలు మా ప్రభాస్‌తో నీకేం పని... ముందు రజనీ, అజిత్, విజయ్ వంటి వారి గురించి వ్యంగ్యాస్త్రాలు విసరమని మండిపడుతున్నారు. సిద్దార్ద్‌ని ట్రోల్ చేస్తున్నారు.
టాలీవుడ్ జోలికి వస్తే చుక్కలు చూపిస్తాం అంటూ హెచ్చరిస్తూ ప్రభాస్ నీ ఫ్రెండే కదా...! మరి ఎందుకింత వెటకారం? అని నెటిజన్లు చేసిన వ్యాఖ్యలపై సిద్దార్ద్ స్పందస్తూ, అందుకే భయ్యా.. ఫ్రెండ్ కాబట్టే ఫ్రీడమ్ తీసుకున్నాను. డార్లింగ్ కూడా ఈ జోక్ విని నవ్వుకుంటాడు. ప్రతి దానికి టెన్షన్ పడితే లైట్‌గా తీసుకోవడానికి టైమ్ ఉండదు కదా..! భయ్యా అని అన్నాడు. మరి ఇప్పటికైనా ప్రభాస్ అభిమానులు శాంతిస్తారో లేదో వేచిచూడాల్సివుంది.