Advertisementt

వెడ్డింగ్‌కు, ప్రీ వెడ్డింగ్‌కు డేట్ ఫిక్స్..!

Wed 18th Jul 2018 11:59 AM
sumanth ashwin,konidela niharika,happy wedding,pre release event  వెడ్డింగ్‌కు, ప్రీ వెడ్డింగ్‌కు డేట్ ఫిక్స్..!
Date Fix for Happy Wedding Pre Release Event వెడ్డింగ్‌కు, ప్రీ వెడ్డింగ్‌కు డేట్ ఫిక్స్..!
Advertisement
Ads by CJ

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌.... అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టుతో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్లగా తెలుగు తెర‌కి పరిచ‌య‌మై ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌ప‌డుచులా  త‌న ప్లెజెంట్ న‌ట‌న‌తో సుస్థిర‌ స్థానం సాధించుకున్న నిహ‌రిక కొణిదెల జంటగా నటించిన చిత్రం హ్యాపివెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య దర్శకుడు. ఈ నెల 21న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

శక్తికాంత్ మ్యూజిక్, ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ రీ రీ రికార్డింగ్ అద్భుతంగా అందిస్తున్నారు. బాల్ రెడ్డి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఈ చిత్రం కథానాయకుడు సుమంత్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా 

నిర్మాతలు మాట్లాడుతూ.... 'పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో జ‌రిగే విష‌య‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఇలాంటి అనుభ‌వం ఉంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌ని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ నెల 21 న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశాం. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.' అని అన్నారు..

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు..

సాంకేతిక నిపుణులు.. యువి క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో, మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్, రీ రీ రికార్డింగ్ - ఎస్. ఎస్. తమన్, కెమెరా - బాల్ రెడ్డి

మ్యూజిక్ - శ‌క్తికాంత్ కార్తిక్‌, నిర్మాత‌ - పాకెట్ సినిమా, ద‌ర్శ‌క‌త్వం - ల‌క్ష్మ‌ణ్ కార్య‌

Date Fix for Happy Wedding Pre Release Event:

Happy Wedding Pre Release Event on July 21st  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ