Advertisementt

నిఖిల్‌ 'ముద్ర' స్పీడందుకుంది..!

Wed 18th Jul 2018 08:20 AM
hero nikhil,mudra,second schedule,lavanya tripati  నిఖిల్‌ 'ముద్ర' స్పీడందుకుంది..!
Nikhil’s ‘MUDRA’ second crucial schedule నిఖిల్‌ 'ముద్ర' స్పీడందుకుంది..!
Advertisement
Ads by CJ

టివి సీరియల్స్‌లో నటిస్తూ, 'సంబరం' చిత్రంలో చిన్న పాత్రను చేసిన నిఖిల్‌ సిద్దార్ద్‌కి 'హ్యాపీడేస్‌, యువత' వంటి హిట్స్‌ కెరీర్‌ ప్రారంభంలో వచ్చాయి. కానీ ఆయన కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ మాత్రం 'స్వామిరా..రా' నుంచి మొదలైంది. ఆ తర్వాత 'కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి పెద్ద హిట్స్‌ని అందుకుని తనదైన విభిన్నదారిలో వెళ్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఈయన నటించిన డిజాస్టర్‌ చిత్రం కేవలం 'శంకరాభరణం' మాత్రమే. ఆ తర్వాత వచ్చిన 'కేశవ' చిత్రం వైవిధ్యభరితంగా రూపొంది ఫర్వాలేదనిపించింది. 

ఇక ఆ నెక్ట్స్‌ ఆయన కన్నడ 'కిర్రాక్‌పార్టీ' రీమేక్‌లో అదే టైటిల్‌తో చిత్రం చేశాడు. ఇది కన్నడ నాట సృష్టించిన సంచలనాన్ని తెలుగులో నమోదు చేయలేకపోయింది. ఇక ప్రస్తుతం మరో రీమేక్‌ చిత్రంలో నటిస్తున్నాడు. తమిళంలో వచ్చిన 'కణితన్‌'ను 'ముద్ర' టైటిల్‌తో రీమేక్‌ చేస్తూ నటిస్తున్నాడు. ఇందులో ఆయన రిపోర్టర్‌గా కనిపించనుండగా హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇక ఈ 'ముద్ర' చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్‌ని నిఖిల్‌ బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. వెన్నెల కిషోర్‌, నాగినీడు, పోసాని కృష్ణమురళి, ప్రగతి, రాజా రవీంద్ర వంటి వారు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్‌, లావణ్య త్రిపాఠిలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, షూటింగ్‌ 50శాతంకి పైగా పూర్తయింది. మరి ఈ రీమేక్‌ ద్వారా అయినా నిఖిల్‌ బలమైన 'ముద్ర' వేస్తాడో లేదో వేచిచూడాల్సివుంది..! 

Nikhil’s ‘MUDRA’ second crucial schedule:

Mudra Movie Latest Update  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ