నిన్నటివరకు నవ మన్మధునిగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం కింగ్‌గా అభిమానుల చేత ఆప్యాయంగా పిలవబడుతున్న అక్కినేని నాగార్జున తెలుగులో టాప్‌స్టార్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈయన తమిళంలో 'రక్షకుడు'తో పాటు త్వరలో మలయాళం చిత్రంలో కూడా నటించనున్నాడు. మరోవైపు ఈయనకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్నా కూడా దానిని కంటిన్యూ చేయకుండా తెలుగు చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. తెలుగులో నాగార్జునని స్టార్‌ని చేసిన 'శివ, అంతం రీమేక్ ద్రోహి, క్రిమినల్, ఖుదాగవా, జక్మ్' వంటి చిత్రాలలో నటించాడు. 'ఖుదాగవా'లో అమితాబ్, శ్రీదేవిలతో నటించిన ఆయన 'జక్మ్' చిత్రంలో అజయ్‌దేవగణ్‌తో కలిసి నటించాడు. దాదాపు మరలా 15ఏళ్ల తర్వాత ఆయన మరో హిందీ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తుండటం విశేషం. క
రణ్‌జోహార్ నిర్మాతగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'రణబీర్‌కపూర్, అమితాబ్‌బచ్చన్, అలియాభట్'లు నటిస్తున్న ఫాంటసీ చిత్రం 'బ్రహ్మాస్త్ర'లో ఆయన కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. షూటింగ్‌లోకి నాగ్ కూడా ఎంటర్ అయ్యాడు. షూటింగ్ లోకేషన్‌లో నాగ్‌తో పాటు ఆయన శ్రీమతి అమల కూడా అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, నేను చివరి హిందీ చిత్రం చేసేటప్పుడు అలియాభట్ చాలా చిన్న పాప. నేడు ఆమెతోనే కలిసి నటిస్తున్నాను. ఈ టీమ్‌లో నేను అమితాబ్‌తో తప్ప మిగిలిన వారితో నటించడం ఇదే మొదటిసారి. లాస్ట్ టైమ్ హిందీ చిత్రం ఎప్పుడు చేశానో కూడా గుర్తు లేదు.
'బ్రహ్మాస్త్ర' కథ నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ సమయంలో ఇలాంటి పాత్ర ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. కథ, పాత్రలు నచ్చితే ఏ చిత్రంలోనైనా నటించడానికి నేను రెడీనే. బల్గేరియాలో షూటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను.. అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో నాగార్జున కీలకపాత్రను చేస్తుండటంపై కరణ్‌జోహార్ స్పందిస్తూ, ఈ చిత్రంలో నాగార్జున చేయడం ఎంతో హానర్డ్‌గా, గౌరవంగా ఫీలవుతున్నాను. ఎగ్జైటింగ్‌గా అనిపిస్తోంది. ఆయన ఎనర్జీకి ప్రేమకు థాంక్యూ.. అని చెప్పుకొచ్చాడు. ఇక రెండు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం వచ్చే ఏడాది ఆగష్టులో విడుదల కానుంది.