గత కొంతకాలంగా కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డి. ఈమె పవన్‌పై చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత ఆమె అసలు సమస్యను వదిలేసి మరో దారిలో పడిపోయిన తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చింది. తాజాగా ఆమె అల్లుఅరవింద్, దగ్గుబాటి సురేష్‌బాబులపై, వారి కొడుకులపై తీవ్ర పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేసింది. పురుషుడు అమ్మాయిలతో పడుకుంటూ శృంగార పురుషులు అంటారని, అదే ఆడది కడుపు కాలి శృంగారానికి ఒప్పుకుంటే హెచ్‌ఐవి వచ్చిందని ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించింది. పనిలో పనిగా ఆమె కోలీవుడ్‌కి చెందిన దర్శకుడు సుందర్‌సి, మురుగదాస్, రాఘవలారెన్స్, శ్రీరామ్(శ్రీకాంత్)వంటి నటులపై కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. వీరందరు తనకి చాన్స్‌లు ఇస్తామని చెప్పి లైంగికంగా వాడుకుని చాన్స్‌లు ఇవ్వలేదని ఆమె మరో మారు ఆరోపించింది.
అదే సమయంలో నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాతల సంఘం అధ్యక్షుడైన విశాల్ నుంచి తనకు ప్రాణాపాయం ఉందని ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీరెడ్డి కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందని గతంలో విశాల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై సీనియర్ నిర్మాత, దర్శకుడు, నటుడు టి.రాజేందర్ స్పందించాడు. శ్రీరెడ్డి ఎవరి మీద ఆరోపణలు చేసిందో వారే సమాధానం చెప్పాలని ఆయన అనడంతో కోలీవుడ్ పరిశ్రమలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఇక విశాల్‌కి తన మీద ఏమైనా ఆరోపణలు వచ్చినా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సమస్యనైనా పరిష్కారానికి పూనుకున్నాడంటే దాని అంతు తేల్చేదాకా నిద్ర పోడనే పేరుంది.
ఇక విశాల్ శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన కోలీవుడ్ ప్రముఖులతో చర్చించి, ఆ తర్వాత వారందరితో కలిసి ఓ ప్రెస్‌మీట్‌ని పెట్టనున్నాడట. ఇక శ్రీరెడ్డి తాను మూడు రోజులు చెన్నైలోనే ఉండి.. తనని లైంగికంగా వాడుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆధారాలు అందజేస్తానని చెప్పడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.