నానిహోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ సీజన్2 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ఈ వారం హౌస్ నుంచి భానుశ్రీ ఎలిమినేట్ అయింది. నిజానికి మొదటి నుంచి ఈ షోకి భానుశ్రీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతో పాటు విన్నర్‌గా నిలిచే టఫ్ కంటెస్టెంట్‌గా ఆమెని అందరు భావించారు. కానీ హౌస్‌మేట్ అయిన అమిత్‌ని ఒప్పించడంలో విఫలం కావడంతో ఆమె బయటకు రాక తప్పలేదు. మరోవైపు కౌశల్ విషయంలో ఆమె చేసిన రచ్చే ఆమె ఎలిమినేషన్‌కి మూలకారణంగా కనిపిస్తోంది.
దాంతో ప్రేక్షకులు ఆమెకి తక్కువగా మద్దతు ఇచ్చారు. చివరకు అదే ఆమె బయటకు వెళ్లిపోవడానికి మూల కారణం అయింది. హౌస్‌లో బాగా ఆడుతోన్న ఆమె తన ఎలిమినేషన్‌తో భావోద్వేగానికి గురైంది. ఇక హౌస్ నుంచి ఆమె బయటకు వస్తుంటే పార్టిసిపెంట్స్ కూడా ఎమోషన్ అయ్యారు. దీప్తి సునయన అయితే ఆమెని కౌగిలించుకుని వలవల ఏడ్చింది. చివరకు ఏడుస్తూ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన ఆమె 'బిగ్‌బాంబ్'ని కౌశల్, అమిత్‌లకు విసిరింది. దీనిలో భాగంగా అమిత్ ఎప్పుడు కుర్చీలోనే కూర్చోవాలి. ఆయన ఎక్కడికి వెళ్లితే అక్కడికి కుర్చీని మోసుకెళ్లి కౌశల్ వేయాలి... అనే బాంబ్‌ని పేల్చింది.
మరోవైపు ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన నాని రాను రాను రాటుదేలుతూ ఉన్నాడు. మొదట్లో కాస్త బిడియంగా, భయపడుతూ కనిపించిన ఆయన ప్రస్తుతం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ షోని నడిపిస్తున్నాడనే చెప్పాలి. మరి విన్నర్‌గా భావించిన భానుశ్రీ చాప్టర్ ముగియడంతో ఇప్పుడు ఉన్న వారిలో ఎవరికి ఈ షోలో గెలిచే అవకాశం ఉందో కాలమే నిర్ణయిస్తుంది.