దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి అనుకోని విధంగా నాగార్జున దృష్టిలో పడి 'ఉయ్యాల జంపాల' చిత్రంతో రాజ్‌తరుణ్ హీరోగా మారాడు. ఆ తర్వాత కూడా ఆయనకు 'కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మావా' అనే రెండు విజయాలు లభించాయి. ఇక మంచు విష్ణుతో కలిసి నటించిన 'ఈడో రకం ఆడో రకం' కూడా బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత మాత్రం వరుసగా ఈయనను పరాజయాలు పలకరిస్తున్నాయి. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రంగులరాట్నం, అంధగాడు, రాజుగాడు' చిత్రాలు వరసగా పరాజయం పాలవుతూ ఉన్నాయి.
ఇక ఈయన నటించిన 'లవర్' చిత్రంపైనే ఈయన ఎన్నోఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఈనెల 20వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన తనకు ఎలాంటి లవర్ కావాలో చెబుతూ, వచ్చే అమ్మాయి నన్ను భరించగలిగితే చాలు. ఈ కాలం కుర్రాళ్లు పబ్‌లు, పార్టీలు, షికార్లు కామన్. కానీ నాకు ఆ అలవాటు లేదు. రెండు సార్లు స్నేహితులతో పబ్‌కి వెళ్లినా ఓ మూలన కూర్చున్నాను. నేను వర్క్ చేసుకునేటప్పుడు, నటించేటప్పుడు ఎవరైనా డిస్ట్రర్బ్ చేస్తే మాత్రం నాకు బాగా కోపం వస్తుంది. నేను కంప్లీట్‌గా ఆఫ్ మైండెడ్ పర్సన్‌ని. ఇంట్లో ఎక్కువగా కూర్చుని ఉంటాను. బయట తిరగను. సినిమాలు చూసేటప్పుడు కథలు రాసుకునేటప్పుడు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కోపం వస్తుంది. అందుకని నన్ను భరించడం కష్టమే.
ఇక మా తాతయ్య నన్ను వివాహం చేసుకోమని ఎప్పటి నుంచో కోరుతున్నాడు. ముందుగా రెండు హిట్స్ ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. వచ్చే ఏడాదికి 27ఏళ్లు నిండటంతో పాటు నా పెళ్లి కూడా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఈయనకు గతంలో హెబ్బాపటేల్‌తో ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ వేడుకలో సుమని మీరు నా కాలంలో పుట్టి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని చేసుకునే వాడిని అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కామెడీగా అన్నా సరే.. ఆ మాటల్లో ఎంతో నిగూడార్ధం ఉందని అంటున్నారు.