మే 9 న చాలా సాధారణంగా అంటే పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సినిమా బిగ్గెట్ హిట్ అయ్యింది. అశ్వినీదత్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన ఈ సినిమా చాలా చోట్ల అమ్ముడవ్వక పోతే... వైజయంతి మూవీస్ వారు డైరెక్ట్ గా విడుదల చేసుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ కావడంతో పెట్టిన పెట్టుబడికి రెండింతలు లాభం వచ్చింది. ఇక మహానటి విడుదలకు ముందు ఆ సినిమా శాటిలైట్ హక్కులను భారీ మొత్తానికి కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోగా.. విడుదలకు ముందు మహానటి సినిమా శాటిలైట్స్ హక్కులు అమ్ముడు పోలేదు. ఆతర్వాత ఒక పెద్ద ఛానల్ మహానటి శాటిలైట్స్ హక్కులను భారీ రేటుకు కొనినట్టుగా వార్తలొచ్చాయి. ఆ విధముగా మీడియం బడ్జెట్ మూవీ కాస్తా భారీ వసూళ్లుకొల్లగొట్టింది.
తాజాగా ఈ నెలలో గత గురువారం విడుదలైన చిన్న బడ్జెట్ మూవీ RX 100 కూడా సేమ్ మహానటి రూటులోనే వెళుతుంది. అసలు విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లోబడ్జెట్ మూవీ మెల్లగా పుంజుకుని నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఈ మూవీ కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కింది. అయితే హీరో కార్తికేయ చిన్నాన్న ఈ సినిమాని నిర్మించడంతో.. హీరో కార్తికేయ ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదు కాబట్టి రెండున్నర కోట్ల బడ్జెట్ ఈ సినిమాకి అయ్యింది. కానీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే పెట్టిన పెట్టుబడి రాబట్టి హిట్ అవడమే కాదు నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. ఇప్పటికే రెండున్నర రెట్లు లాభాలు నిర్మాతలు మూటగట్టుకున్నారు.
ఇంకా RX 100 కి శాటిలైట్స్ కానీ, డిజిటల్ హక్కులు కానీ అమ్ముడు పోలేదు. అందుకే ఈ సినిమాకి ఇప్పుడు ఈ శాటిలైట్ హక్కుల కోసం పోటీ ఏర్పడింది. చిన్న సినిమా అయినా శాటిలైట్స్ హక్కులుకు ఏకంగా 6 కోట్లు కావాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. చివరికి మూడు నాలుగు కోట్లు వచ్చినా.. చాలనే ధీమాలో ఆ నిర్మాతలు ఆ రేంజ్ లో చెబుతున్నారు. మరి మహానటి సినిమా శాటిలైట్స్ విషయం లోను అశ్వినీదత్ మహానటి కోసం భారీ డిమాండ్ చేసాడనే టాక్ ఉంది. ఇప్పుడు RX నిర్మాతలు కూడా అలానే భారీగా డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా శాటిలైట్స్ కోసం భారీ డిమాండ్ అయితే మార్కెట్ లో నడుస్తుంది. చివరికి ఏ ఛానల్ RX ని ఎంత రేటుకి దక్కించుకుంటుందో చూడాలి.