Advertisementt

చిరు ‘సైరా'.. ఇలా అయితే కష్టమే!

Mon 16th Jul 2018 07:29 PM
sye raa narasimha reddy,shooting update,chiranjeevi,ram charan,30 percent  చిరు ‘సైరా'.. ఇలా అయితే కష్టమే!
Chiru Sye Raa completes only 30 Percent of shoot చిరు ‘సైరా'.. ఇలా అయితే కష్టమే!
Advertisement
Ads by CJ

చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. చిరంజీవి రీఎంట్రీ తోనే ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ అంత బడ్జెట్.. అంత సాహసం చేయలేక సేఫ్‌గా రీమేక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ని ఎంచుకున్నారు. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో 'సైరా' సినిమాను స్టార్ట్ చేశాడు చిరంజీవి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూళ్లు కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా ఓ భారీ షెడ్యూల్ కూడా మొదలుపెట్టారు అది కూడా చివరి దశలో ఉంది. దీంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం అయ్యిపోయిందనుకున్నారు అంతా. కానీ చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందట. ఈ చిత్రం అవుట్ ఫుట్ విషయం రామ్ చరణ్ దగ్గర నుండి చిరంజీవి వరకు ఎవరు  కాంప్రమైజ్ అవ్వట్లేదంట. 'బాహుబలి' రేంజ్ లో ఈ చిత్రం రూపొందించాలనే ప్రయత్నం చేస్తున్నారని వినికిడి. అందుకే స్లో గా సినిమా నడుస్తుందని చెబుతున్నారు.

ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది చివరి లోపు షూటింగ్ పూర్తి చేసుకుని.. త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ లో పెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వరకు 30 శాతం మాత్రమే షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో.. అనుకున్న డెడ్ లైన్ రీచ్ అవ్వడం కష్టమే అని చెబుతున్నారు. సో షూటింగ్ లేట్ అవుతుంది కాబట్టి ఇక ఈ సినిమా 2019 అక్టోబర్ లోనో.. సెప్టెంబర్ లోనో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట.

Chiru Sye Raa completes only 30 Percent of shoot:

Sye Raa Narasimha Reddy Shooting Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ