Advertisementt

మహేష్‌ ఫ్యామిలీ హీరోకి ఆదిలోనే కష్టాలు!

Sun 15th Jul 2018 11:04 PM
mahesh babu,galla jayadev,ashok galla,dil raju  మహేష్‌ ఫ్యామిలీ హీరోకి ఆదిలోనే కష్టాలు!
Starting Troubles For Mahesh Babu Nephew మహేష్‌ ఫ్యామిలీ హీరోకి ఆదిలోనే కష్టాలు!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే సుధీర్‌బాబు హీరోగా ఉన్నాడు. ఇక తాజాగా మహేష్‌ ఎంతగానో అభిమానించే ఆయన బావ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. మొత్తానికి ఇతడిని మహేష్‌ దిల్‌రాజు చేతుల్లో పెట్టాడు. ఈ చిత్రం కోసం దర్శకునిగా 'ఆడు మగాడ్రా బుజ్జీ' దర్శకుడు కృష్ణారెడ్డి గంగదాసుని ఫిక్స్‌ చేశారు. గత కొంతకాలంగా కృష్ణారెడ్డి కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. 

అయితే ఎందువల్ల అనేది తెలియదు గానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ నుంచి కృష్ణారెడ్డి గంగదాస్‌ని తొలగించి, శశి అనే దర్శకునికి ఈ బాధ్యతలను అప్పటించాడట దిల్‌రాజు. దీనికి మహేష్‌ కూడా సుముఖత వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ దిల్‌రాజు-అశ్వనీదత్‌ల భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. మరోవైపు గల్లా అశోక్‌ చిత్రం సైతం దిల్‌రాజునే నిర్మిస్తుండటంతో ఘట్టమనేని అభిమానులంతా గల్లా అశోక్‌ తెరంగేట్రం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.

Starting Troubles For Mahesh Babu Nephew:

Director change for Galla Jayadev son's film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ