సల్మాన్‌ఖాన్‌కి కాస్త మెంటల్ అయితే ఉండవచ్చు గానీ ఆ తిక్కకి కూడా పవన్‌లా ఆయనకు ఓ లెక్కుంటుంది. బియింగ్ హ్యూమన్ అనే సంస్థను స్థాపించి ఎందరికో ఆయన సాయం చేస్తున్నారు. మరోవైపు జింకలను వేటాడటం నుంచి ఫుట్‌పాత్‌ల మీద నిద్రించే వారి ప్రాణాలు కూడా తీసినట్లు అనేక వార్తలతో నిత్యం ఆయన పేరు మారుమోగుతూనే ఉంటుంది. కాగా 8ఏళ్ల కిందట సల్మాన్ కవికుమార్ ఆజాద్‌కి సాయం చేశారట. ఆజాద్ వారం రోజుల ముందు గుండెపోటుతో మరణించాడు. 'తారక్ మెహతా కా ఓల్తా చష్మా' అనే టివి సీరియల్ లో నటించాడు.
ఈ సీరియల్ సెట్‌లో ఆయన తీవ్ర అస్వస్థతతో కుప్పకూలి పోయి ప్రాణాలు విడిచాడు. ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించగా డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. ఆ హాస్పిటల్ బిల్లును సల్మానే చెల్లించాడట. అంతేకాదు హాస్పిటల్‌లో ఆయనకు కావాల్సిన అన్నింటిని సల్లూభాయ్ స్వయంగా తన డబ్బుతో చేకూర్చిపెట్టాడు. స్థూలకాయంతో బాధపడుతూ ఉండే కవికుమార్ ఆజాద్ దాదాపు 100 కిలోల బరువు తగ్గారు. ఈ నేపధ్యంలోనే ఆయన వారం కిందట గుండెపోటుతో మరణించాడు.
సల్మాన్ ఇప్పటికే చాలా మంది పేద కళాకారులకి సాయం చేశారు.. చేస్తున్నారు. బీయింగ్ హ్యూమన్ అనే సంస్థను స్థాపించి అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు వైద్య చికిత్సలు అందిస్తూ వారిని ప్రాణాపాయం నుంచి రక్షిస్తూ వస్తున్నారు. ఈ విషయంలో మాత్రం సల్లూబాయ్ చేస్తున్న మంచి పనులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.