Advertisementt

టాక్ బాగుంది.. కలెక్షన్స్ ఎలా వుంటాయో?

Sun 15th Jul 2018 01:33 PM
hero karthi,chinna babu,release,positive talk  టాక్ బాగుంది.. కలెక్షన్స్ ఎలా వుంటాయో?
Karthi Chinna Babu Movie Released టాక్ బాగుంది.. కలెక్షన్స్ ఎలా వుంటాయో?
Advertisement
Ads by CJ

గత కొంత కలం నుండి కోలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కేవలం స్టార్ హీరోల సినిమాలే కాకుండా మీడియం హీరోల సినిమాలు కూడా ఇక్కడ విడుదలవడం.. తెలుగు సినిమాల మీద పోటీగా బాక్సాఫీసు వద్ద పోటీపడడం వంటివి ఎప్పటినుండో జరుగుతున్నదే . అయితే కొన్నిసార్లు తెలుగు సినిమాలు హిట్ అయ్యి కోలీవుడ్ సినిమాలు అందులో కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం టాలీవుడ్ సినిమాలకు కోలీవుడ్ సినిమాలు చుక్కలు చూపెడుతున్నాయి. అసలెందుకు గత నెలలోనే ఆఫీసర్ సినిమాతో పోటీపడిన కోలీవుడ్ మూవీ అభిమన్యుడు సూపర్ హిట్ కాగా.. ఆఫీసర్ అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఇక తాజాగా ఈ గురువారం రెండు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో RX 100  సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ సినిమా తొలిరోజు కలెక్షన్స్ బావుండడమే కాదు... సినిమా నెమ్మదిగా పుంజుకుంటుంది. అయితే ఈ సినిమా కేవలం యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా వుంది. ఇక మరో తెలుగు సినిమా బిగ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుండి సినిమాల్లోకి  అడుగు పెట్టిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత కూడా సో సో గానే ఉంది. క్రిటిక్స్ ప్రేక్షకులు ఈ సినిమాకి సో సో మార్కులేసినా.. కలెక్షన్స్ మాత్రం అంతగా లేవు. ఇక ఈ సినిమాని మెగాస్టార్ చిరు వెన్నుదన్నుగా ప్రమోట్ చేసినా సినిమాలో విషయం లేకపోడంతో పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

మరి ఈ రెండు సినిమాల మీద పోటీకి దిగిన ఖాకి అదేనండి కార్తీ చినబాబు మాత్రం యావరేజ్ తో పాటుగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. గురువారం విడుదలైన రెండు సినిమాల మీద చినబాబు ఒక మార్కు ఎక్కువే వేయించుకుంది. అటు ప్రేక్షకుల నుండి ఇటు క్రిటిక్స్ నుండి కూడా చినబాబు ఈ బాక్సాఫీసు విజయంలో పాస్ అయ్యింది. వ్యవసాయం మెయిన్ కథగా తెరకెక్కిన ఈసినిమాలో ఫ్యామిలీ డ్రామాతో పాటుగా కార్తీ నటనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. అలాగే కొన్ని చోట్ల పేలిన కామెడీ సీన్స్, హీరోయిన్ సాయేషాకి హీరో కార్తీ కి మధ్యన నడిచిన లవ్ ట్రాక్ తోపాటుగా సినిమాటోగ్రఫీ మెయిన్ హైలెట్ గా నిలిచాయి. అలాగే సినిమాలో కొన్ని చోట్ల ఎమోషన్స్, మ్యూజిక్, ఎడిటింగ్, సెకండ్ హాఫ్ కాస్త గ్రాఫ్ పడిపోవడం వంటి చిన్న చిన్న నెగెటివ్ పాయింట్స్ తో కార్తీ చినబాబు మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే కార్తీ చినబాబు కి కలెక్షన్స్ ఎలా ఉంటాయన్నది ప్రస్తుతం బిగ్ సస్పెన్స్. ఎందుకంటే కార్తీ ఖాకి సినిమా హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ అంతంత మాత్రంగా వున్నాయి. 

Karthi Chinna Babu Movie Released:

Chinna Babu Released and Gets Positive Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ