ఎంకిపెళ్లి సుబ్బిచావుకి వచ్చిందనే సామెతను మన పెద్దలు ఊరికే చెప్పలేదు. నిజానికి కొన్ని విషయాలలో చట్టప్రకారం మహిళలకు ఎంత రక్షణ ఉంటుందో పసిపిల్లలకు, మైనర్లకు కూడా అంత కంటే ఎక్కువ రక్షణ, హక్కులు ఉన్నాయి. ఇక విషయానికి వస్తే తాజాగా పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరో వివాహం చేసుకోవాలని భావించింది. మరో ఇంటికి కోడలు కావాలని నిర్ణయించుకున్న ఆమెపై ప్రశంసలు లభిస్తున్నట్లుగానే వెళ్తూ లేని పోని గత విషయాలను తవ్వి బయటకు తీయడం, వాటిని అందరికీ చెప్పడం, తద్వారా రచ్చ, చర్చకు ఆస్కారం ఎందుకు ఇవ్వాలనేది రేణు ఆలోచించడం లేదు.
ఆమె ఆంద్రజ్యోతి ఆర్‌కెకి ఇచ్చిన ఇంటర్వ్యూతో పాటు, స్వప్నకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పలు వ్యక్తిగత విషయాలను మరలా మరలా తవ్వి తీస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. మరోవైపు పవన్ అభిమానులు కూడా అదే రేంజ్‌లో ఆమెకి మించిన రచ్చను సృష్టిస్తున్నారు. తాజాగా పవన్‌ని తాను విడాకులు కోరలేదని, పవనే తనని విడాకులు అడిగాడని ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మరింతగా ఎక్కువైంది.
దీంతో పవన్ అభిమానులు వాగ్వివాదానికి దిగుతూ, పవన్, రేణుదేశాయ్ విడాకుల తేదీ, పవన్-అన్నాలెజినోవాలకు పుట్టిన పోలోనా ప్రస్తావన తెస్తూ ఉండటం బాధాకరం. ఇలా ఇరువురి గొడవలో అభంశుభం తెలియని పాపని వివాద కేంద్రంగా మలుచుకుంటూ, ఆమె చుట్టు సాగుతున్న చర్చ సమంజసం కాదు. ఈ విషయంలో రేణుది, పవన్ ఫ్యాన్స్‌ది కూడా తప్పేనని చెప్పాలి. మరి ఇకనైనా రేణుదేశాయ్ తన మానాన తన వివాహం చేసుకుని, తన పిల్లలతో హ్యాపీ లైఫ్ గడపాలని, పవన్ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టే విధంగా పాత విషయాలను తవ్వి తీయకూడదని భావిద్దాం.