ఎన్నో సమస్యలు, అడ్డంకులు మధ్య 'ఎన్టీఆర్' బయోపిక్ స్టార్ట్ అయింది. గత కొన్ని రోజులు నుండే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ముఖ్య పాత్రలకిగాను నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.
ఎన్టీఆర్ పాత్ర బాలకృష్ణ నటిస్తుండగా.. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తుంది. ఇక నాగిరెడ్డి పాత్రకి గాను ప్రకాశ్ రాజ్ ను .. బీఏ సుబ్బారావు పాత్రకి గాను సీనియర్ నరేశ్ ను.. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు చిత్ర యూనిట్. ఇలా పెద్దపెద్ద స్టార్స్ ఈ సినిమాలో పార్ట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి.
దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అవ్వకుండానే దీని ఓవర్సీస్ హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 12 కోట్లను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి నిర్మాతలు రియాక్షన్ ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.