తాజాగా కొందరు యువకులు, హిజ్రాలు చీరలు కట్టుకుని అర్ధరాత్రి వేళ హైవేలపై నిలబడి విటులను ఆకర్షిస్తూ వస్తుంటారు. ఎవరైనా వారు ఆడవారు అని భ్రమపడి దగ్గరకి వెళ్లితే ఏకంగా ఆ ఆడవేషాలలో ఉన్న వారి గ్యాంగ్ వారిని నిలువు దోపిడీ చేయడం, కొట్టడం, చంపడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే బుల్లితెరపై ఆడవేషాలతో ఆకట్టుకుంటున్న ఓ వర్ధమాన నటుడి విషయానికి వస్తే 'జబర్దస్త్' షోలో హరి అనే యువకుడు ఆడవేషం వేసుకుని స్కిట్స్‌లో నటిస్తూ ఉంటాడు. అచ్చు ఆడపిల్లలా కనిపించే ఆయనకు గతంలో నిజం తెలియక కొందరు ఐ లవ్‌యు కూడా చెప్పారని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు.
ఇక ఈయన గత చరిత్ర వింటే మాత్రం అందరికీ ఆశ్యర్యం వేయకమానదు. తాజాగా ఓ వర్దమాన నటుడిని పోలీసులు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో అరెస్ట్ చేశారని వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతో యూనిట్‌లోని వారందరూ అతనెవ్వరా అని ఆసక్తిగా చర్చించుకుంటూ ఉన్నారు. తాజాగా ఈ నటుడు ఎవరు? ఏమిటి? వంటి విషయాలు బయటకి వచ్చాయి. జబర్ధస్త్‌లో ఆడవేషాలు వేసే హరికి చిత్తూరు జిల్లాలోని రెడ్‌శాండల్ స్మగ్లింగ్‌లో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో హరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.
ఇతను ఏకంగా షకలకశంకర్ హీరోగా నటించిన 'శంభో శంకర'కి అవసరమైన ఆర్దిక సాయాన్ని కూడా అందించి ఫైనాన్షియర్‌గా కూడా మారాడంటే ఆయన రేంజ్ ఏమిటో ఎవరికైనా అర్ధమవుతుంది. కేవలం ఈ ఒక్క కేసు మాత్రమే కాదు.. తిరుపతి, చిత్తూరులలో ఈయనపై 20కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు అంటున్నారు. 20కేసులతో పాటు ఇతర కేసులను కూడా ఆధారంగా చేసుకుని హరిని పక్కా ప్రూఫ్‌తోనే అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.