నిన్న గురువారం టాలీవుడ్ లో ఒక గమ్మత్తయిన విషయం జరిగింది. అదేమిటంటే... నిన్న గురువారం రెండు సినిమాలు బక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. కొత్త కుర్రాడు కార్తికేయ నటించిన RX 100 అంటూ యూత్ఫుల్ మూవీ ఒకటి, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమా రెండు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అయితే ఆ రెండు సినిమాల్లో యువ అండ్ కొత్త హీరో కార్తికేయ RX 100 కి యావరేజ్ టాక్ రాగా... చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మూవీ విజేతకు జస్ట్ ఓకే టాక్ వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలకు ఫుల్ మార్కులు రాలేదు... అంటే హిట్ టాక్ రాలేదు. అలాంటి రెండు సినిమాలను ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న తండ్రి కొడుకులు చెరో సినిమాకి బాసటగా నిలవడమే కాదు రెండు సినిమాల చిత్ర బృందాన్ని అభినందించి వారికి బూస్ట్ ఇచ్చారు. ఇంతకీ ఆ తండ్రీ కొడుకులు ఎవరో కాదు మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు రామ్ చరణ్ లు.
రామ్ చరణ్ ముందుగా RX 100 మూవీ టీమ్ సభ్యులను అభినందించాడు. RX 100 మూవీ యూత్ కి బాగా నచ్చుతుందని... మూవీ టీమ్ కి దర్శకుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు రామ్ చరణ్. ఇక సాయంత్రానికల్లా మెగాస్టార్ చిరంజీవి తన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమాని స్పెషల్ షో ద్వారా తిలకించారు. అల్లు అరవింద్ తో కలిసి చిరంజీవి, కళ్యాణ్ దేవ్ విజేత ని చూసి నిర్మాత సాయి కొర్రపాటి, హీరో కళ్యాణ్ దేవ్, హీరో తండ్రిగా నటించిన మురళీ శర్మ ని, దర్శకుడు రాకేష్ శశిని, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. మరి ఇలా ఒకే రోజు రెండు సినిమాలను ఇలా ఒకే కుటుంబం నుండి వచ్చిన హీరోలు అభినందించడం అనేది ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అంటే యుంగ్ హీరోకి రామ్ చరణ్ అభినందనలు బలాన్నివ్వగా.. కళ్యాణ్ దేవ్ కి ఆయన మామగారు చిరు ఆశీస్సులు దక్కాయి.